‘సింగిల్’ సినిమా టైటిల్స్‌లో హీరో శ్రీ విష్ణు పేరు ముందు ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అని వేసింది చిత్ర బృందం. సినిమా చూసిన వాళ్లకు ఇదేమీ అతిగా అనిపించలేదు. పెద్దగా కథ లేకపోయినా.. శ్రీ విష్ణు ఇచ్చిన నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ వల్లే ఈ సినిమా హిట్టయింది. యూత్ తన కామెడీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ‘సామజవరగమన’, ‘స్వాగ్’ సినిమాల్లోనూ తన కామెడీ బాగా పండింది. ‘సింగిల్’ కూడా హిట్టయిన నేపథ్యంలో ఇకపై అతను వరుసగా ఎంటర్టైనర్లే చేసేలా కనిపిస్తున్నాడు.
నిజానికి శ్రీ విష్ణు కెరీర్ ఆరంభంలో పూర్తిగా సీరియస్ సినిమాలే చేస్తుండేవాడు. అప్పట్లో ఒకడుండేవాడు, నీదీ నాదీ ఒకే కథ.. లాంటి సినిమాల్లో అతడి క్యారెక్టర్లు చాలా సీరియస్‌గా ఉంటాయి. అతనొక మూడీ హీరో అనే పేరు కూడా ఉండేది. అలాంటి వాడు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. టాలీవుడ్లో ఇదొక ఇంట్రెస్టింగ్ మేకోవర్ అని చెప్పొచ్చు.
ఐతే శ్రీ విష్ణు కామెడీ ఇంత బాగా పండించగలడని తాను ఎప్పుడో గుర్తించానని అంటున్నాడు అతడికి అత్యంత సన్నిహితుడైన హీరో నారా రోహిత్. శ్రీ విష్ణుకు కెరీర్ ఆరంభంలో రోహిత్ బాగా సపోర్ట్ చేశాడు. తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది కూడా రోహితే. విష్ణుకు వచ్చిన మరి కొన్ని అవకాశాల వెనుక కూడా రోహిత్ ఉన్నాడు. ఐతే ఒకప్పుడు శ్రీ విష్ణు సీరియస్ సినిమాలు చేస్తుంటే.. కామెడీ ఎంటర్టైనర్లు చేయమని గట్టిగా చెప్పినట్లు రోహిత్ వెల్లడించాడు.
వ్యక్తిగతంగా కూడా శ్రీ విష్ణు చాలా సరదా మనిషి అని.. తనలో చాలా వెటకారం ఉంటుందని, తన నోటి వెంట వన్ లైనర్లు వస్తూనే ఉంటాయని రోహిత్ తెలిపాడు. అతడిది ఎడమచేతి వాటం కావడం వల్ల బాడీ లాంగ్వేజ్ కూడా భిన్నంగా ఉంటుందని.. అది కామెడీకి బాగా ఉపయోగపడుతుందని రోహిత్ చెప్పాడు. రెండు సినిమాలకు ఒకసారి అయినా.. కామెడీ సినిమా చేయాలని తాను ఒత్తిడి తెచ్చేవాడినని.. ఐతే ఇప్పుడు అతను వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ జనాలను అలరిస్తుండడం.. ఎంటర్టైన్మెంట్‌కు కేరాఫ్ అడ్రస్ కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఓ ఇంటర్వ్యూలో నారా రోహిత్ అన్నాడు.
This post was last modified on May 29, 2025 8:53 am
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…