Movie News

కొత్త ట్రెండ్.. రిలీజ్‌కు ముందే సక్సెస్ సెలబ్రేషన్స్

ఒకప్పుడు సినిమాల సక్సెస్ సెలబ్రేషన్లు విడుదలైన 50 రోజులకో, 100 రోజులకో జరిగేవి. సినిమాలు వారాల తరబడి ఆడేవి కాబట్టి.. రన్ పూర్తయ్యాక విజయోత్సవాలు జరిపేవాళ్లు. కానీ ఇప్పుడు సినిమాల రన్ వారం రెండు వారాలకు పరిమితం అవుతోంది. చాలా చిత్రాల పని వీకెండ్‌తోనే అయిపోతోంది. అందుకు తగ్గట్లే సక్సెస్ సెలబ్రేషన్లు కూడా చాలా త్వరగానే వచ్చేస్తున్నాయి. తొలి వీకెండ్లో, కుదిరితే తొలి రోజే విజయోత్సవ సంబరాలు జరిగిపోతున్నాయి. రెండు షోలైనా అవ్వకముందే సెలబ్రేట్ చేయడమూ చూస్తున్నాం.

ఐతే ఇప్పుడు విడుదలకు నాలుగు రోజుల ముందే విజయోత్సవ సంబరాలతో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్. అతను హీరోగా తెరకెక్కిన ‘భైరవం’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. నిన్న ప్రసాద్ ల్యాబ్‌లో తన సన్నిహితులతో కలిసి ఈ సినిమా ప్రివ్యూ షో చూశాడు శ్రీనివాస్. ఆ వెంటనే అతను సక్సెస్ సెలబ్రేషన్లు మొదలుపెట్టేశాడు.
కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడమే కాక.. బయట పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి శ్రీనివాస్ అండ్ టీం చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సినిమా చూశాక పెద్ద హిట్ అని కాన్ఫిడెన్స్ వచ్చేసి ఉండొచ్చు. కానీ రిలీజ్‌కు ముందే ఇంత పెద్ద ఎత్తున సంబరాలు చేయడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. టాలీవుడ్లో ఇది కొత్త ట్రెండ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. దీని మీద సెటైర్లు కూడా పడుతున్నాయి. కానీ చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా, పైగా ఔట్ పుట్ బాగా వచ్చేసరికి శ్రీనివాస్ అండ్ కో ఎగ్జైట్ అయినట్లున్నారని.. దీన్ని మరీ నెగెటివ్‌గా చూడాల్సిన అవసరం లేదని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రలు పోషించిన ‘భైరవం’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on May 27, 2025 6:41 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

శివన్నతో ఉపేంద్ర… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

13 minutes ago

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

2 hours ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

3 hours ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

3 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

5 hours ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

5 hours ago