Movie News

ఆమిర్ సినిమా.. నో ఓటీటీ

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆమిర్ ఖాన్ కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తొమ్మిదేళ్ల ముందు ‘దంగల్’ సినిమాతో ఏకంగా రూ.2 వేల కోట్ల మైలురాయిని అందుకున్న హీరో ఆయన. ఆ చిత్రం చైనాలో కూడా ఇరగాడేయడంతో ఏ ఇండియన్ సినిమాకూ సాధ్యం కాని విధంగా రూ.2 వేల కోట్ల వసూళ్లు సాధ్యమయ్యాయి. అలాంటి హీరో ఇప్పుడు వంద కోట్ల వసూళ్లు సాధించడం కూడా కష్టంగా కనిపిస్తోంది. ఆయన చివరి రెండు చిత్రాలు ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లాల్ సింగ్ చడ్డా’ పెద్ద డిజాస్టర్లయ్యాయి. ‘లాల్ సింగ్ చడ్డా’ అయితే మరీ దారుణమైన ఫలితాన్నందుకుంది. 

ఆమిర్ నుంచి తర్వాత రాబోయే ‘సితారే జమీన్ పర్’ కూడా అదే బాటలో సాగబోతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ మూవీ ట్రైలర్ అంత నెగెటివిటీని ఎదుర్కొంది మరి.. ‘లాల్ సింగ్ చడ్డా’ తరహాలోనే దీన్ని కూడా ఓ వర్గం సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ ‘బాయ్‌కాట్’కు పిలుపునిస్తోంది. అయినా ఆమిర్ మాత్రం ధైర్యంగా అడుగు ముందుకు వేస్తున్నాడు. జూన్ 20న ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘సితారే జమీన్ పర్’ ఆమిర్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమా డిజిటల్ హక్కుల విషయంలో ఆయన బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. దీన్ని అసలు ఏ ఓటీటీలోనూ రిలీజ్ చేయరట. థియేటర్లలో విడుదలైన 8 వారాలకు కూడా ఏ ఓటీటీ సంస్థలోనూ సినిమాను రిలీజ్ చేసేలా ఒప్పందం జరగలేదట. నేరుగా యూట్యూబ్‌లో సినిమాను ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో అందుబాటులో ఉంచుతారట. ఒకసారి సినిమా చూడ్డానికి ఇంత అని చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్లో సినిమాను ఇలా చూడాలే తప్ప ఓటీటీలో విడుదల చేసే ఉద్దేశాలు ప్రస్తుతానికి ఆమిర్‌కు లేవట. 

ఓటీటీలో థియేటర్ల ఆదాయాన్ని తినేస్తున్నాయనే ఉద్దేశంతో దీనికి బ్రేక్ వేయాలని ఆమిర్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక ముందు తన ప్రతి సినిమాకూ ఇలాగే చేయాలని ఆయన భావిస్తున్నారట. ఐతే ఈ ప్రయోగం విజయవంతం కావాలంటే ముందు ‘సితారే జమీన్ పర్’ థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకోవాలి. అప్పుడే ఆమిర్ ఏం చేసినా చెల్లుతుంది. స్పానిష్ మూవీ ‘ఛాంపియన్స్’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ఆర్.ఎస్.ప్రసన్న దర్శకుడు.

This post was last modified on May 27, 2025 2:35 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago