Movie News

మెగా ఫ్యాన్స్ కూల్ అయినట్లేనా?

బాలీవుడ్లో కొన్నేళ్లుగా నడుస్తున్న ‘బాయ్‌కాట్’ ట్రెండ్‌ను ఈ మధ్య తెలుగు వాళ్లు కూడా అందిపుచ్చుకుంటున్నారు. సినిమాలో ఏదైనా అభ్యంతరకర డైలాగ్ ఉన్నా.. లేదంటే చిత్ర బృందంలోని వారు హద్దులు దాటి మాట్లాడినా, సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా.. ఆ సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. కొన్ని నెలల కిందట వైసీపీని ఉద్దేశించి కమెడియన్ పృథ్వీ ఏదో అన్నాడని.. ‘లైలా’ సినిమాను ఆ పార్టీ వాళ్లు టార్గెట్ చేశారు. ఆ సినిమా కంటెంట్ లేక డిజాస్టర్ అయినా.. తామే దాన్ని ఫెయిల్ చేసినట్లు చెప్పుకున్నారు. ఇక తాజాగా ‘భైరవం’ సినిమా రెండు వర్గాలకు టార్గెట్ అయింది.

ముందేమో దర్శకుడు విజయ్ కనకమేడల చేసిన ఒక పొలిటికల్ కామెంట్‌పై వైసీపీ వాళ్లు ఫైర్ అయ్యారు. ఇంతలో ఆశ్చర్యకరంగా మెగా ఫ్యాన్స్ లైన్లోకి వచ్చారు. దర్శకుడి పాత ఫేస్ బుక్ పోస్టు మీద వాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘బాయ్‌కాట్ భైరవం’ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. వీళ్లు అందుకోగానే.. వైసీపీ వాళ్లు సైలెంట్ అయ్యారు.
ఐతే నిన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో మెగా అభిమానులను కూల్ చేసే ప్రయత్నం గట్టిగానే జరిగింది. విజయ్.. చిరు డైలాగ్‌ చెప్పి తన మెగా అభిమానాన్ని చాటుకున్నాడు. ఆల్రెడీ మెగా ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన అతను.. నిన్నటి ఈవెంట్లో ఆ వివాదం గురించి ఏమీ మాట్లాడలేదు.

తర్వాత మంచు మనోజ్.. విజయ్ గురించి చాలా బాగా మాట్లాడ్డమే కాక.. తన ప్రమేయం ఏమీ లేని వివాదానికి తాను సారీ చెప్పాడు. ఆల్రెడీ కుటుంబ వివాదానికి సంబంధించి మనోజ్ మీద జనాల్లో సానుభూతి ఉంది. ఇక ఈ సినిమాను కాపాడ్డం కోసం తన తాపత్రయమంతా నిన్న కనిపించింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ కూల్ అయినట్లే కనిపిస్తున్నారు. ‘బాయ్‌కాట్ భైరవం’ ట్రెండ్ ఆగింది. మనోజ్ స్పీచ్ విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నారు. నువ్వెందుకు సారీ చెప్పడం అని కామెంట్ చేస్తూ.. ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ‘భైరవం’ చుట్టూ నెలకొన్న కాంట్రవర్శీలకు ఇంతటితో తెరపడినట్లే కనిపిస్తోంది. ఈ శుక్రవారం ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.

This post was last modified on May 26, 2025 7:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago