Movie News

ప‌వ‌న్ సినిమాలు ఆపే ద‌మ్ము ఎవ‌రికుంది? : దిల్‌రాజు

తెలుగు సినీ రంగ అగ్ర‌న‌టుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌ను ఆపే ద‌మ్ము ఎవ‌రికీ లేద‌ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ప్ర‌స్తుతం ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండురోజుల కింద‌ట రాసిన లేఖ సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తూనే ఉంది. సినీ రంగానికి కృత‌జ్ఞ‌త లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో ప‌లువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఒక్కొక్క‌రుగా స్పందిస్తున్నారు. బ‌న్నీ వాసు, అల్లు అర‌వింద్, నిర్మాత నాగ‌వంశీ ఇప్ప‌టి వ‌రకురియాక్ట్ అయ్యారు.

తాజాగా దిల్ రాజు కూడా మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలను ఆపే ద‌మ్ము ఎవ‌రికుంద‌ని ప్ర‌శ్నించారు. అలా చేసే ద‌మ్ము ఎవ‌రికీ లేద‌న్నారు. ఎగ్జిబిట‌ర్ల‌కు కొన్ని స‌మ‌స్య‌లు ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పారు. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన కొంద‌రు ఎగ్జిబిట‌ర్లు(పేర్లు చెప్ప‌లేదు) ఈ స‌మ‌స్య‌ను వివ‌రించార‌ని చెప్పారు. దీనిపై చ‌ర్చలు కొన‌సాగుతున్నాయ‌న్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేసిన‌ట్టు చెప్పారు.

ప్ర‌స్తుతం ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రి బ్యూట‌ర్ల ప‌ర్సంటేజీ స‌మ‌స్య రెండు రాష్ట్రాల్లోనూ ఉంద‌న్నారు. ఈ క్ర‌మంలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు చెబితే వద్దని తాను అడ్డుకున్న‌ట్టు రాజు తెలిపారు. బంద్ అనేది కేవ‌లం ఆలోచ‌న మాత్ర‌మేన‌ని దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని అన్నారు. అయితే.. వీర‌మ‌ల్లు సినిమా విష‌యంలో త‌ప్పుడు ప్ర‌చారం ఎక్కువైంద‌ని ఆరోపించారు. కానీ, పవన్‌కల్యాణ్‌ సినిమాలను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదన్నారు.

వాస్త‌వానికి ఫిలిం చాంబ‌ర్‌లోనే స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, రెండు ప్ర‌భుత్వాల నుంచి త‌మ‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని రాజు వివ‌రించారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచమంటే.. ఎలాంటి ప్ర‌శ్న‌లు కూడా అడ‌గ‌కుండానే పెంచుతున్నార‌ని చెప్పారు. కానీ, త‌మ‌లో త‌మ‌కు ఐక్య‌త లోపించిన కార‌ణంగానే ఇలా జ‌రుగుతోంద‌ని.. దీనిలో మీడియా పాత్ర కూడా ఉంద‌ని ఆరోపించారు. ఇక నుంచైనా ఇలాంటివి క‌ట్టిపెట్టాల‌ని ఆయ‌న సూచించారు.

This post was last modified on May 26, 2025 7:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

9 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

47 minutes ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

1 hour ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago