పెద్ద బడ్జెట్ తో హిట్ 3 ది థర్డ్ కేస్ నిర్మించిన నిర్మాత కం హీరో నాని దాన్ని ఉత్తరాదిలో కేవలం సింగల్ స్క్రీన్లకే పరిమితం చేయడం పట్ల తొలుత కొన్ని కామెంట్లు వచ్చాయి. తమ సముదాయాల్లో షోలు ఇవ్వాలంటే ఓటిటి గ్యాప్ కనీసం యాభై రోజులు ఉండాలనేది నార్త్ మల్టీప్లెక్సులు పెట్టుకున్న నిబంధన. దానికి ఒప్పుకుంటేనే పివిఆర్ ఐనాక్స్ లాంటి వాటిలో స్క్రీనింగ్ ఉంటుంది. కానీ నాని నో అన్నాడు. నెట్ ఫ్లిక్స్ లో 28 రోజుల స్ట్రీమింగ్ కి ఎస్ చెప్పేసి దానికి అనుగుణంగా ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసుకున్నాడు. కట్ చేస్తే తెలుగులో సూపర్ హిట్టయిన హిట్ 3 హిందీలో ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.
ఈ వారం మే 29న హిట్ 3 డిజిటల్ లో వచ్చేస్తోంది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నాని నిర్ణయం ఎంత సబబో అర్థమవుతుంది. ఒకవేళ హిందీ మల్టీప్లెక్సుల కోసం నాని కనక యాభై రోజుల అగ్రిమెంట్ చేసుకుని ఉంటే నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేసిన మొత్తంలో ఎక్కువ కోత పడేది. దానికి తోడు ఉత్తరాది థియేటర్ రెస్పాన్స్ పెద్దగా రాలేదు కాబట్టి త్వరగా రన్ పూర్తి చేయాల్సి వచ్చేది. దాని వల్ల నష్టపోయేది నాని తప్ప వేరొకరు కాదు. అందుకే నెల రోజుల విండో చాలనుకుని దానికి తగ్గట్టే సింగల్ స్క్రీన్లలో వేస్తే చాలనుకుని కట్టుబడ్డాడు. పైగా మొదటి వారంలోనే వచ్చిన హెచ్డి పైరసీ చాలా పెద్ద దెబ్బ కొట్టింది. బయటికి చెప్పలేదంతే.
ఒకపక్క థియేటర్, ఓటిటి మధ్య గ్యాప్ తగ్గాలని దాన్ని ఎనిమిది వారాలకు పెంచాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఇకపై నిర్మాతల ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి. అలా చేసినంత మాత్రాన జనాలు థియేటర్లకు పరిగెత్తుకొస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే కోర్ట్ లాంటి చిన్న సినిమాను ఆదరించిన ప్రేక్షకులే కోట్లకు కోట్లు ఖర్చుపెట్టిన డిజాస్టర్లను మొహమాటం లేకుండా తిరస్కరించారు. ఏదేమైనా ఓటిటి విషయంలో మనమే అలవాటు చేసి మనమే దాన్ని మాన్పించాలనుకోవడం అంత సులభం కాదు. అందుకే నాని లాంటి ప్రొడ్యూసర్లు తీసుకునే నిర్ణయాలు సబబుగా అనిపిస్తున్నాయి.
This post was last modified on May 24, 2025 1:01 pm
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…