తెలుగు మూలాలున్న కన్నడ అమ్మాయి శ్రీలీల ప్రస్తుతం ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరు. తెలుగులో ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు తమిళంలో, హిందీలో, కన్నడలోనూ నటిస్తోంది శ్రీలీల.
హిందీలో ‘ఆషిఖి-3’ లాంటి క్రేజీ మూవీ చేస్తున్న శ్రీలీల.. తమిళంలో శివకార్తికేయన్ సరసన ‘పరాశక్తి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరాశక్తి ఆమెకు తమిళంలో గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తుండగా.. ఇప్పుడా చిత్రం పెద్ద చిక్కుల్లో పడింది. తెలుగమ్మాయి అయిన సుధ కొంగర ‘ఆకాశం నీ హద్దురా’ తర్వాత చేస్తున్న ఈ చిత్రమిది.
కొన్ని నెలల కిందట రిలీజ్ చేసిన ‘పరాశక్తి’ టీజర్ భలేగా అనిపించింది. శివకార్తికేయన్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘అమరన్’తో బ్లాక్ బస్టర్ కొట్టిన శివకార్తికేయన్‌కు ఈ సినిమా నిర్మాతలు ఏకంగా రూ.70 కోట్ల పారితోషకం ఇస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడీ చిత్రం సమస్యల్లో చిక్కుకుంది. ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న డాన్ పిక్చర్స్ అధినేతలు ఓ స్కామ్‌లో చిక్కుకున్నారు. ఈడీ అధికారులు వారిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ స్కామ్ చాలా పెద్దదనే తెలుస్తోంది. నిర్మాతలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డట్లే కనిపిస్తున్నారు.
శివ కార్తికేయన్ మార్కెట్ స్థాయికి మించి ఇచ్చిన పారితోషకంలో బ్లాక్ మనీ చాలా ఉందని.. ఆ డబ్బుతో శివకు ఒక భారీ భవంతిని నిర్మిస్తున్నారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు నిర్మాతలు ఈడీ అధికారుల వలలో చిక్కుకోవడంతో శివ సైతం ఇబ్బందుల్లో పడ్డాడని అంటున్నారు. ఈ సినిమా మధ్యలో ఆగిపోయేలా ఉందని.. చిత్రీకరణ ముందుకు సాగడం కష్టమని కూడా చెబుతున్నారు. ఓ క్రేజీ ప్రాజెక్టుతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నానని శ్రీలీల ఎగ్జైట్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ సినిమా మధ్యలో ఆగిపోయేలా ఉండడంతో ఆమెకు కోలీవుడ్లో పెద్ద బ్రేక్ పడ్డట్లే. తెలుగమ్మాయే అయిన దర్శకురాలు సుధకు కూడా ఇది ఇబ్బందే.
This post was last modified on May 23, 2025 4:50 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…