అక్కినేని నాగార్జున కేవలం నటుడే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బేనర్ మీద ఆయన అనేక పెద్ద, చిన్న సినిమాలను నిర్మించారు. అలాగే అదే బేనర్ మీద ఎన్నో చిత్రాలను డిస్ట్రిబ్యూటర్ చేశారు కూడా. గత కొన్నేళ్లలో మారిన పరిస్థితుల దృష్ట్యా కొంచెం దూకుడు తగ్గించారు నాగ్. ఐతే కొంచెం గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ ఓ పెద్ద సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అది ఆయన వేరే భాషలో నటించిన సినిమా కావడం విశేషం.
‘నా సామి రంగ’ తర్వాత స్క్రీన్ మీద కనిపించని నాగ్.. రెండు చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘కుబేర’ కాగా.. ఇంకోటి ‘కూలీ’. వీటిలో ‘కూలీ’ మీద ఉన్న అంచనాలే వేరు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందకు రాబోతోంది. అసలే సూపర్ స్టార్ సినిమా. పైగా లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఇంకా నాగ్‌తో పాటు ఉపేంద్ర ఓ కీలక పాత్ర చేశాడు. దీంతో ఈ సినిమాకు హైప్ మామూలుగా లేదు. ఈ చిత్ర తెలుగు హక్కుల కోసం గట్టి పోటీనే నెలకొంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ‘కూలీ’ తెలుగు హక్కుల కోసం గట్టిగానే పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వేరే సంస్థలు కూడా పోటీలో ఉన్నప్పటికీ నాగవంశీ తెలుగు రైట్స్ కోసం ఏకంగా రూ.40 కోట్లకు పైగా రేటు పెట్టడానికి రెడీ అయ్యాడట. రజినీ గత చిత్రం ‘వేట్టయాన్’తో పోలిస్తే ఇది నాలుగు రెట్లకన్నా ఎక్కువ రేటు కావడం విశేషం. ఐతే ఇలా ఫ్యాన్సీ రేటు ఇస్తున్నప్పటికీ.. ‘కూలీ’ మేకర్స్ అక్కినేని నాగార్జున వైపే చూస్తున్నారట. ఆయన కూడా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రేసులో ఉన్నాడట. రేటు కొంచెం అటు ఇటు అయినప్పటికీ నాగ్‌కు ప్రయారిటీ ఇస్తున్నట్లు సమాచారం. ఈ డీల్ ఫిక్స్ అయితే.. నాగ్ నటించిన సినిమాను ఆయనే రిలీజ్ చేస్తే హైప్ ఇంకా పెరగడం ఖాయం.
This post was last modified on May 22, 2025 10:31 pm
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…