జూన్ 5 విడుదల కాబోతున్న దగ్ లైఫ్ చూశాక నాయకుడుని మర్చిపోతారని కమల్ హాసన్ పెద్ద స్టేట్ మెంట్ ఇవ్వడం సినీ ప్రియుల్లో హాట్ టాపిక్ గా మారింది. 1987లో వచ్చిన ఈ ఆల్ టైం క్లాసిక్ గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. అప్పట్లో ముంబై మాఫియాని ఏలిన వరదరాజ ముదలియార్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని దానికి హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్ తరహా స్క్రీన్ ప్లే రాసుకుని మణిరత్నం వెండితెర మీద అద్భుతం సృష్టించారు. నాయకుడు ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఇప్పటికీ ఎందరో దర్శకులు ఆయన్ని ఫాలో అవుతుంటారు. గత ఏడాది వరుణ్ తేజ్ మట్కాలో అలాంటి సన్నివేశాలు చాలానే చూడొచ్చు.
కమల్ స్వయంగా చెప్పినా సరే నాయకుడుని మర్చిపోవడం జరగని పని. కేవలం కథా కథనాల పరంగానే కాదు ఎన్నో విషయాల్లో అది మాస్టర్ పీస్ అయ్యింది. ముఖ్యంగా ఇళయరాజా పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని తలదన్నేలా ఇప్పుడు ఏఆర్ రెహమాన్ మేజిక్ చేయడం అసాధ్యం. ఆల్రెడీ రిలీజైన పాటలు వింటే అది అర్థమైపోతుంది. నాయకుడుకి చాలా బలమైన ఆర్టిస్టులు దొరికారు. జనకరాజ్, టిను ఆనంద్, శరణ్య, తార, వాసుదేవ రావు, ప్రదీప్ శక్తి, నాజర్, నిలల్గల్ రవి లాంటి క్యాస్టింగ్ తమ కట్టిపడేసే పెరఫార్మన్సులతో ఆడియన్స్ ని మెప్పించారు. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం గురించి తెలిసిందే.
అప్పట్లో టైమ్స్ మ్యాగజైన్ వరల్డ్ టాప్ 100 మూవీస్ లో చోటు దక్కించుకున్న ఒకే ఇండియన్ మూవీ నాయకుడు. ఇంత లెగసి ఉన్న ఈ సినిమాని మించిపోయేలా దగ్ లైఫ్ ఉంటే సంతోషమే. 38 సంవత్సరాల తర్వాత చేతులు కలిపిన మణిరత్నం, కమల్ హాసన్ ఆ మేజిక్ రిపీట్ చేయాలనే మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటించిన దగ్ లైఫ్ లో శింబు, అశోక్ సెల్వన్, నాజర్ ఇతర పాత్రలు పోషించారు. అప్పట్లో భాషతో సంబంధం లేకుండా నాయకుడు తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఘనవిజయం సాధించింది. మరి దగ్ లైఫ్ కూడా అలా యునానిమస్ గా మెప్పించగలిగితే అంతకన్నా కావాల్సింది ఏముంది.
This post was last modified on May 22, 2025 12:23 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…