గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం కొత్తేమీ కాకపోయినా.. గత మూడేళ్లలో మాత్రం అది విస్తృత స్థాయికి చేరుకుంది. కొత్త చిత్రాల స్థాయిలో భారీగా థియేటర్లు, షోలు కేటాయించడం.. అర్లీ మార్నింగ్ షోలు వేయడం.. అభిమానుల సంబరాలు పతాక స్థాయికి చేరడం.. వీటిలో కూడా ఓపెనింగ్స్, ఓవరాల్ కలెక్షన్ల రికార్డుల గురించి చర్చ జరగడం.. ఇలా చాలానే చూశాం.
ఎన్నోసార్లు చూసిన సినిమాలను మళ్లీ ఇలా థియేటర్లలో సెలబ్రేట్ చేయడం తెలుగు ప్రేక్షకులకే చెల్లిందంటూ ఇతర భాషల వాళ్లు సైతం కొనియాడారు. దీని మీద కొంత విమర్శలు కూడా తప్పలేదు. ఐతే ఇప్పటిదాకా ఆయా హీరోల సినిమాలకు వారి అభిమానులు పట్టం కట్టడం బాగానే ఉంది కానీ.. ఇప్పుడు ఈ తేడాలు పక్కన పెట్టి అందరూ కలిసి సెలబ్రేట్ చేయాల్సిన రీ రిలీజ్ ఒకటి రెడీ అయింది. అదే.. మాయాబజార్.
ఎన్ని ఏళ్లు గడిచినా.. తరాలు మారినా.. ఇది మా సినిమా అని తెలుగు వారు గర్వంగా చెప్పుకునే చిత్రాల్లో ‘మాయాబజార్’ ముందు వరుసలో ఉంటుంది. రైటింగ్.. టేకింగ్.. యాక్టింగ్.. ఇలా అనేక విషయాల్లో ఇప్పటికీ ఈ చిత్రం నుంచి నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు ఉన్నాయి. దాదాపు ఏడు దశాబ్దాల కిందట వచ్చిన సినిమా అయినా.. ఇప్పుడు చూసినా తాజాగా, ఎంతో ఆసక్తికరంగా అనిపించే మేలిమి చిత్రమది.
ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల చివరి వారంలో ‘మాయాబజార్’ను రీ రిలీజ్ చేస్తున్నారు. కొన్నేళ్ల కిందటే ఈ చిత్రాన్ని ఎంతో శ్రమించి మొత్తం కలర్‌లోకి మార్చారు. రీ రిలీజ్ ట్రెండ్ ఏమీ లేని టైంలో ఆ సినిమాను పరిమిత స్క్రీన్లలో రిలీజ్ చేస్తే మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీని గురించి కొందరు ప్రముఖులు కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలకు పట్టం కట్టి మన సినిమా వైభవాన్ని కొత్త తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on May 21, 2025 10:33 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…