త్రివిక్రమ్‍తో త్వరలోనే సినిమా వుంటుందంటూ ఖలేజా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో మహేష్ ప్రకటించాడు. ఎన్టీఆర్‍తో త్రివిక్రమ్ సినిమా ఆల్రెడీ ప్రకటించగా, మహేష్ ‘సర్కారు వారి పాట’ కూడా సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధంగా వున్న టైమ్‍లో తననుంచి ఆ ప్రకటన రావడం ఆశ్చర్యపరచింది. అయితే ఆ టైమ్‍లో నిజంగానే మహేష్, త్రివిక్రమ్ ఇద్దరూ కూడా వెంటనే సినిమా మొదలు పెట్టడానికి చాలా గట్టిగా కృషి చేసారట.
అయితే ఎన్టీఆర్ ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడిందట. అయితే త్రివిక్రమ్‍తో సినిమా చేయడం ఖాయమయినా కానీ ఎప్పుడు వుంటుందనే దానిపై మహేష్‍కి క్లారిటీ లేదు. ఎందుకంటే సర్కారు వారి పాట పూర్తయ్యేనాటికి త్రివిక్రమ్ ‘ఎన్టీఆర్ 30’తో బిజీగా వుంటాడు. అతను వచ్చే వరకు మహేష్ ఎదురు చూడలేడు కనుక ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలంటే ఇద్దరూ ఒకే టైమ్‍లో తీరికగా వుండాలి.
అందుకే త్రివిక్రమ్ పుట్టినరోజుకి తమ సినిమా ఊసేమీ లేకుండా కేవలం బర్త్ డే విషెస్ మాత్రం చెప్పి వదిలేసాడు మహేష్. అయితే ఈ కాంబినేషన్ త్వరలోనే తెరపైకి వస్తుందనే ఆశ పెట్టుకున్న అభిమానులు మాత్రం ఈ పరిణామంతో కాస్త డిజప్పాయింట్ అయ్యారు.
This post was last modified on November 7, 2020 3:41 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…