ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తతో దిగిన ఫోటోలను తెగ షేర్ చేస్తూ వుండేది. నిజానికి పెళ్లికి ముందు నుంచే వారిద్దరూ తమను మించిన ప్రేమ జంట లేరని అనుకోవాలని తెగ తాపత్రయ పడేవాళ్లు. ప్రియాంక తన భర్తతో దిగిన ఫోటోలతో నిత్యం ట్రెండింగ్‍లో వుండేది.
కాజల్ అగర్వాల్ కూడా ఇప్పుడు తన భర్తపై తనకెంత ప్రేమ వుందనేది ప్రపంచానికి తెలియజేయడం కోసం తెగ కష్టపడుతోంది. పెళ్లికి ముందు అసలు అతడితో కనీసం పరిచయం వున్నట్టు కూడా ఎక్కడా తెలియనివ్వలేదు. కానీ పీకల్లోతు ప్రేమలో వున్నామని, ఒకరిని విడిచి ఒకరం వుండలేమని తెలిసిన తర్వాతే పెళ్లి చేసుకున్నామని, లాక్‍డౌన్ టైమ్‍లో ఒకర్నొకరు విడిచి వుండలేక కిరాణా కొట్ల వద్ద కలుసుకునే వాళ్లమని టీనేజ్ జంటల మాదిరిగా చెప్పుకుంటోంది.
తన చెల్లెలు తనకంటే ముందే ఎప్పుడో పెళ్లాడి తల్లయిపోయినా కానీ ఇంతకాలం నటిస్తూనే వున్న కాజల్ ఇప్పుడు పాతికేళ్ల వయసులో మిస్ అయిన ముచ్చట్లు తీర్చుకుంటున్నట్టుంది. అయితే కాజల్ చూపిస్తోన్న ప్రేమ మరీ డ్రమెటిక్‍గా వుందని, నేచురల్‍గా అనిపించేలా బిహేవ్ చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి.
This post was last modified on November 7, 2020 3:39 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…