నిన్న విడుదలైన ధగ్ లైఫ్ ట్రైలర్ లో హీరోయిన్లు అభిరామి, త్రిషలతో కమల్ హాసన్ చేసిన రొమాన్స్ మీద సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ జరుగుతోంది. ఏడు పదుల వయసులో లోక నాయకుడి చిలిపితనం పోలేదని, లేట్ ఏజ్ లోనూ ఆయన ముద్దులు పెడుతుంటే చూడముచ్చటగా ఉందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇంకోవైపు ఇలాంటి కిస్సు సన్నివేశాలు కమల్ కు అవసరమా, అవి లేకుండా సినిమా తీయలేరా అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. మణిరత్నం – కమల్ కాంబోలో వచ్చిన నాయకుడులో ఎలాంటి ముద్దులు, శృంగార సన్నివేశాలు ఉండవు. కానీ ధగ్ లైఫ్ లో బోలెడు పెట్టినట్టే కనిపిస్తోంది.
ఇప్పుడీ డిబేట్ లో కొత్త కోణం బయటికి తీస్తున్నారు టాలీవుడ్ అభిమానులు. ఆ మధ్య డాకు మహారాజ్ లో ఊర్వశి రౌతేలాతో బాలయ్య వేసిన స్టెప్పుని ట్రోల్ చేసినవాళ్లు, భోళా శంకర్ లో చిరంజీవి యాంకర్ శ్రీముఖితో చేసిన కామెడీ గురించి ఎగతాళి చేసిన వాళ్ళకు ఇప్పుడు కమల్ రొమాన్స్ మాత్రం చూడముచ్చటగా ఉందా అంటూ కౌంటర్స్ వేస్తున్నారు. రవితేజతో శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే లాంటి యంగ్ బ్యూటీస్ జత కట్టినప్పుడు కూడా ఇలాంటి కామెంట్లు బోలెడొచ్చాయి. కానీ ధగ్ లైఫ్ లో కమల్ చేసింది కళాత్మక సృష్టి అనే రేంజ్ లో బిల్డప్ ఇవ్వడాన్ని సోషల్ మీడియా తెలుగు యువత అంగీకరించలేకపోతోంది.
కమల్ ఇప్పుడే కాదు గతంలో ఎన్నో సినిమాల్లో ఆధర చుంబనాలతో వార్తల్లో నిలవడం మాములు విషయం. ద్రోహిలో గౌతమి, హే రామ్ లో రాణి ముఖర్జీ, ఇప్పుడు ధగ్ లైఫ్ లో నటించిన అభిరామితోనే గతంలో పోతురాజులో చూపించిన కెమిస్ట్రీ ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టు అవుతుంది. ఇప్పుడూ దాన్నే ఫాలో అవుతున్నారు కాబోలు. కథ ప్రకారం డిమాండ్ మేరకే అలా చేశామని హీరో దర్శకుడు సమర్ధించుకోవచ్చు గాక. అయినా గ్యాంగ్ స్టర్ డ్రామాలను అవి లేకుండా తీయొచ్చని సత్య, కంపెనీ లాంటి వాటిలో చూశాంగా. మరి ధగ్ లైఫ్ లో ట్రైలర్ లో చూపించిన డోసే ఉంటుందా లేక ఇంకా ఎక్కువా అనేది జూన్ 5 చూడాలి.
This post was last modified on May 18, 2025 2:56 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…