-->

ప్యారడైజ్ నానికి తల్లి దొరికేసిందా ?

నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనా హీరోకు సంబంధించిన షూట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. వచ్చే నెల నుంచి నాన్ స్టాప్ గా న్యాచురల్ స్టార్ ఇందులో భాగం కాబోతున్నాడు. ఇప్పటిదాకా కథకు సంబంధించిన లీక్స్ పెద్దగా బయటికి రాలేదు. అయితే అనౌన్స్ మెంట్ టీజర్ లో చూపించిన విజువల్స్, నాని పాత్రతో చెప్పించిన బూతు పదం, దానివెనుక బలమైన కారణం ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. చాలా కీలకమైన తల్లి పాత్ర ఎవరు చేస్తారనే సస్పెన్స్ ఫ్యాన్స్ లో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు దానికి సమాధానం దొరికినట్టే.

మరాఠి, హిందీ నటి సోనాలి కులకర్ణిని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మదరాఫ్ నానిగా ఎంచుకున్నట్టు తెలిసింది. ఇప్పుడంటే వయసు మళ్లింది కానీ 1992లో తను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చెప్పుకోదగ్గ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ప్రేమదేశం వినీత్ తో మే మధం ఆమెకు తొలి దక్షిణాది డెబ్యూ. తర్వాత హిందీకి పరిమితమయ్యింది. ఎక్కువ సక్సెస్ రేట్ లేకపోవడంతో త్వరగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. హృతిక్ రోషన్ మిషన్ కాశ్మీర్ గుర్తింపు తేగా తర్వాత దిల్ చాహ్ తా హై, టాక్సి నెంబర్ 9211 లాంటివి చెప్పుకోదగ్గ హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం రెండు మరాఠి ఒక బాలీవుడ్ మూవీతో బిజీగా ఉంది.

ఆర్టిస్టుగా సోనాలి కులకర్ణికి మంచి పేరుకుంది. మన్వత్ మర్డర్స్, ముంబై డైరీస్, క్రైమ్ పెట్రోల్ లాంటిని ఓటిటి మార్కెట్ ని తీసుకొచ్చాయి. ప్యారడైజ్ లో మదర్ క్యారెక్టర్ కు చాలా డెప్త్ ఉంటుంది. ఎవరూ ఊహించని షాక్ వేల్యూ పెట్టారు. అందుకే తెలుగు సీనియర్లు ఎందరిని అడిగినా పనవ్వలేదని ఇన్ సైడ్ టాక్. ఆ కారణంగానే శ్రీకాంత్ ఓదెల ముంబై వెళ్లి మరీ సోనాలి కులకర్ణిని ఒప్పించాడని టాక్. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆల్రెడీ ఆవిడ షూట్ లో పాల్గొందని, చైల్డ్ ఎపిసోడ్స్ తన మీదే తీశారని వినికిడి. ఇది ఎంతవరకు నిజమో తేలాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడక తప్పదు.