కోలీవుడ్ లోనే కాదు ఏ వుడ్డులో అయినా వన్ అఫ్ ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకునే కలయిక కమల్ హాసన్ – మణిరత్నంది. చేసింది ఒక సినిమానే. అదే నాయకుడు. కానీ ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయింది. వరదరాజా ముదలియార్ అనే వ్యక్తి జీవితాన్ని గాడ్ ఫాదర్ స్ఫూర్తితో వీరయ్య నాయుడుగా మార్చిన వైనం 1987లో సంచలనం రేపింది. ఇది జరిగి 38 సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ ఈ కాంబో కోసం మూవీ లవర్స్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కోరిక ఫలిస్తూ తగ్ లైఫ్ వస్తోంది. జూన్ 5 విడుదల సందర్భంగా ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు. కథేంటో రెండు నిమిషాల వీడియోలో చెప్పేశారు.
శత్రువులతో తలపడే క్రమంలో తనను ప్రాణాలు పోకుండా కాపాడిన కృతజ్ఞతతో అమర్ (శింబు) ని చేరదీస్తాడు రంగరాయ (కమల్ హాసన్). కొడుకు కన్నా ఎక్కువ చూసుకుని తన మాఫియా సామ్రాజ్యానికి వారసుడిగా ప్రకటిస్తాడు. అనుచరుడు (నాజర్) ఈర్ష్యతో రగిలిపోతున్నా సరే లెక్క చేయడు. అయితే అనుకోని అనూహ్య పరిణామాల వల్ల రంగరాయ, అమర్ ల మధ్య కత్తులు దూసుకునే ద్వేషం మొదలవుతుంది. ఒకరినొకరు చంపుకునే దాకా వెళ్తారు. అసలు దీనికి కారణమైన వాళ్ళు ఎవరు, భార్య (అభిరామి) ఉండగా రంగరాయ జీవితంలోకి వచ్చిన మరో అమ్మాయి(త్రిష) ఎవరనే ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి.
టేకింగ్ పరంగా చాలా సైలిష్ గా కనిపిస్తున్న టీజర్ లో ఒకప్పటి మణిరత్నం కనిపించలేదు కానీ స్టోరీ పరంగా ఏదో బలమైన నేపధ్యాన్ని సెట్ చేసుకున్న క్లూస్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా కమల్, శింబుల మధ్య క్లాష్ ఆధారంగా యాక్షన్ డ్రామాని డిజైన్ చేసిన విధానమే హిట్టా ఫ్లాపా నిర్ణయించబోతోంది. ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డిఫరెంట్ గా ఉంది. కాన్సెప్ట్ ఓకే కానీ రెగ్యులర్ మాస్ ఆడియన్స్ ఎంత మేరకు కనెక్ట్ అవుతారనేది సినిమా చూశాక కానీ క్లారిటీ రాదు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు కమల్ హాసనే డబ్బింగ్ చెప్పుకున్నారు. జూన్ 5 పోటీ లేకుండా వస్తున్న తగ్ లైఫ్ లో అశోక్ సెల్వన్ మరో ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు.
This post was last modified on May 17, 2025 10:14 pm
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…