భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ విషయంలో ముందు కన్ఫ్యూజన్ అనుకున్నది కాస్తా వివాదం అయ్యేలా ఉంది. రెండు రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో రాజమౌళి, కార్తికేయతో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థలు మేడ్ ఇన్ ఇండియా సిరీస్ లో భాగంగా దీన్ని తీయాలనే ప్లాన్ లో ఉన్నట్టు వార్త బయటికి వచ్చింది. అయితే అమీర్ ఖాన్ సైతం ఇదే ప్రాజెక్టు కోసం దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో చేతులు కలిపినట్టుగా ముంబై మీడియాలో రావడంతో ఒక్కసారిగా ఇది హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుసల్కర్ ఎంట్రీ ఇచ్చాడు.
తమను మూడు సంవత్సరాల నుంచి అమీర్ ఖాన్ బృందం ఫాలోఅప్ చేస్తూ సమాచారం సేకరిస్తున్నారని, వాళ్ళ పరిశోధన నచ్చిందని, హిరానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చర్చకు దారి తీస్తోంది. రాజమౌళి తరఫున ఎవరూ తమను కలవలేదని చెబుతున్న చంద్రశేఖర్ ఎవరిదైనా బయోపిక్ తీసే ముందు సదరు కుటుంబ సభ్యులను కలిసి అనుమతి తీసుకోవాలని అర్థం వచ్చేలా చెప్పడం గమనార్హం. ఇక్కడితో ఆగలేదు. ఫాల్కే భార్య సరస్వతి బాయ్ ఫాల్కే పాత్రలో విద్య బాలన్ అయితే బాగుంటుందని రికమండేషన్ కూడా చేశాడు.
చూస్తుంటే ఇది ఇప్పట్లో ఆగే వ్యవహారంలా కనిపించడం లేదు. దీనికి సంబంధించిన అప్డేట్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ రోజు కేవలం వార్ 2 ప్రమోషన్ మాత్రమే హైలైట్ చేయబోతున్నారట. ఇప్పుడీ ఫాల్కే ఇష్యూ కొత్త మలుపులు తిరగడంతో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కన్నా ముందు ఈ అనుమానాలు తీర్చుకోవడం అవసరం. రాజమౌళి టీమ్ నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. ఇటు అమీర్ వైపు నుంచి అధికారికంగా ఏం చెప్పడం లేదు. మీడియా కథనాల్లో మాత్రం తారక్ వర్సెస్ అమీర్ అంటూ రకరకాల విశ్లేషణలు, డిబేట్లు కొనసాగుతున్నాయి.
This post was last modified on May 17, 2025 11:42 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…