ప్రభాస్ తీసుకునే నిర్ణయాలు ఏమిటో

విదేశాల నుంచి ప్రభాస్ తిరిగి వచ్చేశాడు. ముందు ఏది మొదలుపెడతాడనే సస్పెన్స్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. ది రాజా సాబ్ టీజర్ రెడీగా ఉంది. డార్లింగ్ డబ్బింగ్ చెప్పడమే ఆలస్యం వీలైనంత త్వరగా ఈ నెలలోనే లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంకా బ్యాలన్స్ ఉన్న నాలుగు పాటల షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందనే దాని గురించి సరైన సమాచారం రాకపోవడం వాళ్ళలో ఆందోళన రేపుతోంది. ట్విస్ట్ ఏంటంటే మే 21 నుంచి ప్రభాస్ ఫౌజీ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడనే వార్త మరింత కన్ఫ్యూజన్ కు దారి తీస్తోంది. టీమ్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రావడం లేదు.

ఒకవేళ ఇదే నిజమైన పక్షంలో రాజా సాబ్ కన్నా ముందు ఫౌజీ సిద్ధమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ అయోమయం తీరడానికి ఇంకొంచెం సమయం పట్టేలా ఉంది. దర్శకుడు మారుతీ తరచుగా సోషల్ మీడియా, ఇతర వేదికలపై ఆలస్యానికి సంబంధించిన సంకేతాలు ఇవ్వడం లేదు కానీ జరుగుతున్న పరిణామాలు కొత్త అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఈ ఏడాది రాజా సాబ్ ని తెరమీద చూడటం డౌట్ గానే ఉంది. ఒకవేళ బ్యాలన్స్ ఎంత వేగంగా తీసినా డిసెంబర్ లో రిలీజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సంక్రాంతిని టార్గెట్ చేసుకోవడం కష్టం. ఆల్రెడీ స్లాట్స్ ని వేరే పెద్ద సినిమాలు లాక్ చేసుకుని ఉన్నాయి.

సో స్పష్టత రావాలంటే ప్రభాస్ తక్షణ కర్తవ్యం ఏమిటో తను బయటికి వచ్చాకే తెలుస్తుంది. వీటికే ఇలా ఉంటే స్పిరిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది మరో భేతాళ ప్రశ్న. సందీప్ రెడ్డి వంగా లొకేషన్ హంట్, క్యాస్టింగ్ పనులు పూర్తి చేస్తున్నాడు. ఈ వేసవిలో మొదలుపెట్టే సూచనలు తక్కువగానే ఉన్నాయి. కల్కి 2, సలార్ 2 కి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. వీటి సంగతి ఎలా ఉన్నా ఫౌజీ విషయంలో హను రాఘవపూడి పక్కా ప్లానింగ్ తో వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఏమో గుర్రమెగారావచ్చు తరహాలో అనూహ్యంగా మార్పులు జరిగి రాజా సాబ్, ఫౌజీ రిలీజులు ముందు వెనక్కు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.