సౌత్ ఇండియాలో తెరపై మంచి జోడీలుగా పేరు తెచ్చుకుని నిజ జీవితంలోనూ జంటగా మారిన వాళ్లలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సూర్య, జ్యోతికల గురించే. వీళ్లిద్దరూ కలిసి తమిళంలో ఏడు సినిమాలు చేశారు. ఆ సినిమాలు చేస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
వివాహం తర్వాత సూర్య కుటుంబంలో చాలా బాగా కలిసిపోయి చక్కటి గృహిణిగా మారిపోయింది జ్యోతిక. ఐతే ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్లు కొంచెం పెరిగి పెద్దయ్యాక ఆమె మళ్లీ సినిమాల్లోకి పునరాగమనం చేయాలనుకుంటే సూర్య ఏమీ అడ్డు చెప్పలేదు. పైగా సొంత బేనర్లో మంచి కథలతో ఆమెను లీడ్ రోల్‌లో పెట్టి సినిమాలు నిర్మించాడు. జ్యోతిక పునరాగమనంలో చేసిన సినిమాలన్నీ మహిళల సమస్యలు, వాళ్ల సాధికారత చుట్టూ తిరిగేవే కావడం విశేషం. అవి వినోదంతో పాటు మంచి సందేశాన్ని కూడా అందించాయి.
చివరగా ‘పొన్ మగళ్ వందాల్’ సినిమాతో జ్యోతిక పలకరించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఇప్పుడు అదే ఓటీటీలో తన కొత్త చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ను కూడా రిలీజ్ చేస్తున్నాడు ఇదిలా ఉంటే త్వరలోనే సూర్య, జ్యోతిక కలిసి ఓ సినిమా చేయబోతున్నారన్న సమాచారం వారి అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. వీళ్లిద్దరి కోసం మలయాళ దర్శకురాలు అంజలి మీనన్.. తమిళ డైరెక్టర్ హాలిత కలిసి ఓ కథ రాస్తోందట.
ఇందులో సూర్య, జ్యోతికల వయసుకు తగ్గ పాత్రల్లో కనిపిస్తారట. అంజలి ఇంతకుముందు ‘బెంగళూరు డేస్’ లాంటి క్లాసిక్‌ను అందంచంది. ఆ తర్వాత మరి కొన్ని మంచి సినిమాలు తీసింది. మంచి అభిరుచి ఉన్న దర్శకురాలు కావడంతో ఆమెతో బహు భాషా చిత్రం చేయడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఫీల్ గుడ్ సినిమాలు తీసే అంజలి సూర్య, జ్యోతికల కోసం ఎలాంటి కథ రాస్తుంది.. వాళ్లనెలా ప్రెజెంట్ చేస్తుందన్నది ఆసక్తికరం.
This post was last modified on November 6, 2020 4:55 pm
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో…
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…