ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం అన్నది సినీ రంగంలో చాలా కామన్ వ్యవహారం. ఇలా చేతులు మారిన సినిమాలు మంచి ఫలితాన్నందుకుని ముందు కథ విన్న హీరోలు చింతించేలా చేస్తుంటాయి. కొన్ని చిత్రాలు ఫెయిలై వాటిని వదులుకున్న హీరోలు హమ్మయ్య అనుకునేలా చేస్తాయి. శర్వానంద్ కెరీర్లో స్పెషల్ ఫిలింగా నిలిచిన ‘ఒకే ఒక జీవితం’ నిజానికి విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమా అట. తమిళంలో ‘కణం’ పేరుతో తెరకెక్కి.. తెలుగులో ‘ఒకే ఒక జీవితం’గా విడుదలైందీ సినిమా. ముందు దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ కథను విజయ్‌కే చెప్పాడట. విజయ్‌కి ఆ కథ విపరీతంగా నచ్చేసిందట.
రెండుమూడు సార్లు ఈ కథ విని.. హీరోగా నటించడంతో పాటు స్వయంగా తనే నిర్మించాలని కూడా భావించాడట. మరో నిర్మాత కూడా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చాడట. కానీ ఈ కథకు తాను న్యాయం చేయలేనేమో అనే అనుమానంతో ‘ఒకే ఒక జీవితం’ను వదులుకున్నట్లు విజయ్ తెలిపాడు. ఒక ప్రేక్షకుడిగా ఈ కథ విని ఎంజాయ్ చేస్తున్నాం సరే.. తాను అందులో ఫిట్ అవుతానా అని ఆలోచిస్తే.. తన మీద తనకు సందేహం కలిగి ఈ సినిమాను వదులుకున్నట్లు విజయ్ తెలిపాడు.
ఇక తన కొత్త చిత్రం ‘కింగ్‌డమ్’ గురించి చెబుతూ.. ఇది ప్రస్తుతానికి ఫ్రాంఛైజీ మూవీ కాదని చెప్పాడు. అలా అని పార్ట్-2 రాదనేమీ చెప్పలేమన్నాడు. దీన్ని ఒక కథగా చెప్పాలనే ‘కింగ్‌డమ్’ అనే టైటిల్ పెట్టామని.. సినిమా రిలీజయ్యాక ప్రేక్షకుల స్పందనను బట్టి పార్ట్-2 చేయాలా అనేది ఆలోచిస్తామని తెలిపాడు. ఈ చిత్రంతో తొలిసారిగా తనతో కలిసి పని చేసిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మీద విజయ్ ప్రశంసలు కురిపించాడు. తాను హీరో కాకముందే అతడికి ఫ్యాన్ అయిపోయానని.. తాను హీరో అయితే తనతో కలిసి పని చేయాలనుకున్నానని.. ‘అజ్ఞాతవాసి’లోని ‘గాలి వాలుగా’ అనిరుధ్ పాటల్లో తన ఫేవరెట్ అని విజయ్ తెలిపాడు.
This post was last modified on May 15, 2025 12:06 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…