న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ సెట్లో ఇంకా హీరో అడుగు పెట్టకుండానే బిజినెస్ డీల్స్ హాట్ గా మారిపోతున్నాయి. తాజాగా ఆడియో హక్కులను సరిగమ సంస్థ 18 కోట్లకు కొనుగోలు చేసిందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కాంబోకున్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం పెట్టడం సబబేనని భావించిన సదరు కంపెనీ తాజగా ఒప్పందం పూర్తి చేసుకుందని సమాచారం. గతంలో నాని, అనిరుధ్ కలయికలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ వచ్చాయి. మ్యూజికల్ గా రెండూ పెద్ద హిట్సే. పాటల పరంగా మ్యూజిక్ లవర్స్ ని నిరాశపరచలేదు.
ది ప్యారడైజ్ మీద ట్రేడ్ లో చాలా హైప్ ఉంది. టీజర్ లో చూపించిన శాంపిల్, కంటెంట్ ఎంత బోల్డ్ గా ఉండబోతోందో డైలాగుల ద్వారా శ్రీకాంత్ ఓదెల చెప్పిన విధానం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. నాని కెరీర్ లోనే కాదు ఇప్పటిదాకా టాలీవుడ్ హీరోల్లో చాలా తక్కువ మంది కనిపించిన షాకింగ్ ట్విస్టు తన క్యారెక్టర్ లో ఉంటుందని ఇప్పటికే టాక్ ఉన్న నేపథ్యంలో ఈ హైప్ ని దృష్టిలో పెట్టుకునే అంత మొత్తాన్ని ఆడియో కోసం వెచ్చించడానికి సరిగమ సిద్ధమయ్యింది. ఇంకా సాంగ్స్ రికార్డింగ్ మొదలవ్వలేదు. నాని ఫ్రీ అయ్యాక త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ ఒక కొలిక్కి తేలబోతున్నట్టు సమాచారం.
వచ్చే ఏడాది మార్చి 26 విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ కు పోటీగా రామ్ చరణ్ పెద్ది వస్తున్నప్పటికీ వాయిదా వేసుకునే ఆలోచనలో నాని ఎంతమాత్రం లేడు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో రెండు ఆడతాయనే ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పుడు ప్యారడైజ్ కు ఏర్పడుతున్న డిమాండ్ చూస్తుంటే నాని మార్కెట్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 ది థర్డ్ కేస్ ఇలా వరసగా దూసుకుపోతున్న వైనం దానికి తగ్గట్టే రేట్లను పెంచుకుంటూ పోతోంది. ప్యారడైజ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. రెగ్యులర్ షూట్ కు వెళ్ళాక మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి.
This post was last modified on May 14, 2025 8:54 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…