Movie News

‘తమ్ముడు’కి ఎన్నెన్ని కష్టాలో…

నితిన్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. తమ్ముడు. ‘భీష్మ’ తర్వాత నితిన్‌కు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. చెక్, రంగ్ దె, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఇలా వరుసగా తన సినిమాలు నిరాశపరిచాయి. చివరి చిత్రం ‘రాబిన్ హుడ్’ అయినా మ్యాజిక్ చేస్తుందనుకుంటే అది మరో డిజాస్టర్ అయింది. దీంతో తర్వాతి చిత్రం ‘తమ్ముడు’ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడతను. ‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్ రూపొందిస్తున్న చిత్రమిది. ఈ సినిమా మేకింగ్ అనుకున్న దాని కంటే చాలా ఆలస్యం అయింది. బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు ఈ చిత్రానికి సరైన రిలీజ్ డేటే కుదరట్లేదు.

ముందేమో మహాశివరాత్రి అన్నారు. తర్వాత వేసవి రిలీజ్ అన్నారు. చివరికి జులై 4కు కొత్త డేట్ ప్రకటించారు. ఈసారి పక్కాగా ఆ డేట్‌కు రిలీజ్ చేస్తామని చెప్పుకున్నారు. ఇటీవలే రిలీజ్ డేట్ మీదే ఒక స్పెషల్ వీడియో కూడా చేసింది ‘తమ్ముడు’ టీం. రిలీజ్ మళ్లీ మళ్లీ వాయిదా పడుతుండడం.. ఏదో ఒక డేట్ ఫిక్స్ చేయకపోవడం మీద టీం తమ మీద తామే సెటైర్లు వేసుకుని చివరికి జులై 4న సినిమా రాబోతోందని ప్రకటించుకున్నారు.

రెండు రోజుల ముందు కూడా ‘తమ్ముడు’ థీమ్ గురించి ఒక వీడియో రిలీజ్ చేసి అందులోనూ రిలీజ్ డేట్‌ను నొక్కి వక్కాణించారు. తీరా చూస్తే ‘కింగ్ డమ్’ కోసమని ఇప్పుడు ‘తమ్ముడు’ను వాయిదా వేసుకున్నారు. ఇలాంటి సర్దుబాట్లు ఇండస్ట్రీలో మామూలే కానీ.. అసలే నితిన్ స్ట్రగుల్లో ఉంటే తన సినిమాకు ఇన్నిసార్లు రిలీజ్ డేట్ మార్చి, ఇంత ఆలస్యం చేస్తే అది సినిమాకు నెగెటివ్ అయ్యే ప్రమాదముంది. వీలైనంత త్వరగా కొత్త డేట్ ఎంచుకుని.. ఆ తేదీకైనా పక్కాగా సినిమాను రిలీజ్ చేస్తే బెటర్.

This post was last modified on May 14, 2025 12:38 pm

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

1 hour ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

1 hour ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

2 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

2 hours ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

3 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

4 hours ago