కోలీవుడ్ లోనే కాదు తెలుగులోనూ నమ్మదగ్గ ప్రాఫిటబుల్ హీరోగా మారాడు ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే సూపర్ హిట్టయినప్పుడు అందరూ ఏదో లాటరీ అనుకున్నారు. డ్రాగన్ అంతకు మించి విజయం సాధించినప్పుడు ఎవరికీ నోరు విప్పే అవకాశం దక్కలేదు. ఇప్పుడు కేవలం ఒక్క నెల గ్యాప్ లో రెండు పెద్ద సినిమాలతో రావడం చూసి టయర్ 2 స్టార్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. నిన్న అతను నటించిన డ్యూడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు దీపావళికి విడుదల చేస్తామని ప్రకటించడం చూశాం. కేవలం కొన్ని గంటల్లోనే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సెప్టెంబర్ 18 రిలీజ్ చేయబోతున్నట్టు ఇంకో అనౌన్స్ మెంట్ వచ్చింది.
అంటే బ్యాక్ టు బ్యాక్ కేవలం నెల రోజుల్లో రెండు సినిమాలు రాబోతున్నాయి. నిజానికి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చాలా నెలలుగా నిర్మాణంలో ఉంది. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ కాగా విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. టైటిల్ కూడా కొంత కాలంలో వివాదంలో ఉండింది. ఎల్ఐసి నుంచి అభ్యంతరం రావడంతో కార్పొరేషన్ ని కంపెనీగా మార్చారు. ఎస్జె సూర్య ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో పాటు ఫాంటసీ టచ్ ఉంటుందని చెన్నై టాక్. ప్రేమలు ఫేమ్ మమిత బైజుతో నటించిన డ్యూడ్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. దీనికి మంచి బిజినెస్ ఆఫర్స్ ఉన్నాయి.
చూస్తుంటే ధనుష్ పోలికలే కాదు స్పీడ్ కూడా ప్రదీప్ రంగనాథన్ కు అబ్బుతున్నట్టు ఉంది. స్వతహాగా దర్శకుడైన ఇతను ఇప్పుడు డైరెక్షన్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. హీరోగా అన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఎవ్వరికైనా నటించడం కన్నా సేఫ్ గేమ్ మరొకటి ఉండదు. అందుకే కుర్రాడు దీనికే కట్టుబడేలా ఉన్నాడు. ఒక ఏడాదిలో మూడు సినిమాలు రిలీజ్ కావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో విశేషమే. అన్నట్టు ఇతను తెలుగులోనూ ఒక స్ట్రెయిట్ మూవీ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ట్విస్ట్ ఏంటంటే మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లు ఇతని సరసన జట్టు కట్టేందుకు గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడం. సుడి అలా ఉంది మరి.
This post was last modified on May 12, 2025 3:12 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…