Movie News

జగదేకవీరుడు హిట్టు కొట్టాడు….ఫ్యాన్స్ వింటేజ్ ఫీలింగ్

ముప్పై అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సినిమా రీ రిలీజైతే దానికి అభిమానులు రావడంలో ఆశ్చర్యం లేదు కానీ వాళ్ళతో పాటు పిల్లలు, కుటుంబ సభ్యులు థియేటర్లకు తరలి రావడం ఖచ్చితంగా విశేషమే. జగదేకవీరుడు అతిలోకసుందరి విషయంలో ఇది జరుగుతోంది. శుక్రవారం వైజయంతి మూవీస్ ఘనంగా విడుదల చేసిన ఈ ఫాంటసీ మూవీకి ఆదరణ దక్కుతున్న వైనం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మొదటి రోజే పన్నెండు లక్షలకు పైగా గ్రాస్ నమోదు కావడం చిన్న విషయం కాదు. ఆదివారం వీకెండ్ షోలు చాలా మటుకు ఫుల్ అయ్యాయి. నిన్నటితోనే వరల్డ్ వైడ్ గ్రాస్ రెండున్నర కోట్లు రాబట్టింది ఒక అంచనా.

ఇక్కడే కాదు విజయవాడ, గుంటూరు, వైజాగ్, మచిలీపట్నం తదితర నగరాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాము చిన్నప్పుడు నాన్నలతో కలిసి చూసిన విజువల్ వండర్ ని ఇప్పుడు త్రిడిలో తమ పిల్లలతో కలిసి చూడటాన్ని ఒక ప్రత్యేక అనుభూతిగా ఫీలవుతున్నారు ఫ్యాన్స్. హాలు లోపల సెలబ్రేషన్స్, అబ్బని తీయని దెబ్బ పాటకు చిరంజీవి శ్రీదేవి కాస్ట్యూమ్స్ వేసుకొచ్చి యువతీ యువకులు డాన్సులు చేస్తున్న వైనం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సినిమా చూసి బయటికొచ్చిన పబ్లిక్ మీడియాతో పంచుకుంటున్న రియాక్షన్లు జనాల సంతోషాన్ని బయట పెడుతున్నాయి.

ప్రింట్ క్వాలిటీ గురించి కొంత కంప్లయింట్ ఉన్నప్పటికీ ఆడియన్స్ దక్కించుకుంటున్న వింటేజ్ ఫీలింగ్ ముందు అదేమీ హైలైట్ కావడం లేదు కానీ ఒకవేళ అది కూడా బెస్ట్ వచ్చి ఉంటే ఫ్యాన్స్ రిపీట్ షోలు వేసుకునేవాళ్ళన్నది వాస్తవం. మొత్తానికి జగదేకవీరుడు అతిలోకసుందరికొచ్చిన రెస్పాన్స్ మరిన్ని క్లాసిక్స్ ని బయటికి తెచ్చేలా ఉంది. చిరంజీవి కౌ బాయ్ మూవీ కొదమసింహంకు ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 90 దశకంలో వచ్చిన బ్లాక్ బస్టర్స్ కి కనెక్టివిటీ ఎక్కువగా ఉన్న తరుణంలో ఆ టైంలో వచ్చిన హిట్ సినిమాల నిర్మాతలను సంప్రదించే పనిని డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే మొదలుపెట్టారట.

This post was last modified on May 12, 2025 12:21 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

1 minute ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

23 minutes ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

3 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

5 hours ago

లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…

8 hours ago