టాలీవుడ్లో బాగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే హీరోల్లో సుమంత్ ఒకడు. అతను మీడియా, సోషల్ మీడియాలో అస్సలు కనిపించడు. దీనికి తోడు చాలా ఏళ్ల నుంచి తన సినిమాలు కూడా సరిగా ఆడకపోవడంతో లైమ్ లైట్లో లేకుండా పోయాడు. తన ఫిల్మ్, పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా చర్చ ఉండదు. ఐతే సుమంత్ ఇప్పుడు ‘అనగనగా..’ అనే ఓ ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ నెల 15 నుంచి ఈటీవీ విన్‌లో ఈ సినిమా నేరుగా స్ట్రీమ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సుమంత్. ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
మృణాల్ ఠాకూర్‌తో సుమంత్ పెళ్లంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి అడిగితే అతను షాకైపోయాడు. ఒక హీరో, హీరోయిన్ కొంచెం సన్నిహితంగా ఉన్న ఫొటో కనిపిస్తే చాలు.. జనాలు రకరకాల కథలు అల్లేస్తారు. అలాగే సుమంత్, మృణాల్ కలిసి ఉన్న ఫొటో చూసి ఇలాంటి ప్రచారానికే తెర తీశారు. దీని గురించి సుమంత్ క్లారిటీ ఇచ్చాడు. తాను మృణాల్‌తో కలిసి ‘సీతారామం’ సినిమా చేశానని.. ఆ టైంలో ప్రమోషన్ల సందర్భంగా దిగిన ఫొటో అదని.. అంతకుమించి పర్సనల్‌గా తమ మధ్య ఏమీ లేదని సుమంత్ స్పష్టం చేశాడు.
తమ గురించి ఇలాంటి ప్రచారం జరుగుతోందని తనకు తెలియదంటూ షాకయ్యాడు సుమంత్. ఇక తనకు సినిమాలు తప్ప ఏమీ తెలియదని.. ఉన్న సినిమాలేవో చేసుకుంటూ.. సంపాదించిన డబ్బులను జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటూ సింపుల్‌గా జీవితాన్ని గడిపేస్తానని సుమంత్ తెలిపాడు. తనకు జిమ్ చేయడం, హోం థియేటర్లో సినిమాలు చూడడం, కుక్కలతో ఆడుకోవడంతో ఎక్కువ సమయం గడుస్తుందని.. ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ అని.. వారితో కొంత టైం స్పెండ్ చేస్తానని.. సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటానని సుమంత్ తెలిపాడు.
This post was last modified on May 11, 2025 2:27 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…