నిహారిక కొణిదెల మంచి టాలెంటెడ్ ఉన్న నటి… వెబ్ సిరీస్ ‘ముద్ధపప్పు ఆవకాయ’లోనే తన టాలెంట్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించిందీ మెగా డాటర్. ‘ఢీ’ షోకి హోస్టింగ్ చేయడమే కాకుండా కొన్నాళ్ల కిందట ‘జబర్ధస్త్’లో గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి, బాబాయ్, పెద్దనాన్న, అన్నయ్యలను ఇమిటేట్ చేస్తూ స్కిట్‌లో విశ్వరూపం చూపించింది. నటిగా, హోస్ట్‌గా నిరూపించుకున్న నిహారిక… లాక్‌డౌన్ టైమ్‌లో తనలో దాగిఉన్న మరో యాంగిల్ చూపించింది.
డ్యాన్స్ మాస్టర్ యశ్వంత్‌తో కలిసి డ్యాన్స్‌ఫ్లోర్‌లో దుమ్ము రేపింది నిహారిక. బ్లాక్ కలర్ డ్రెస్‌లో హాట్ హాట్ స్టెప్స్‌లో నిహారిక వేసిన స్టెప్స్ చూస్తే, మతిపోవడం గ్యారెంటీ. అయితే తన గ్లామర్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌ను వేడెక్కించిన నిహారిక… డ్యాన్స్‌లో మాత్రం గ్రేస్ చూపించలేకపోయింది.
మెగా ఫ్యామిలీ అంటేనే డ్యాన్స్‌కి కేరాఫ్ అడ్రెస్. మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి రామ్ చరణ్, అల్లుఅర్జున్, సాయిధరమ్ తేజ్… ఇలా మెగా హీరోలందరూ డ్యాన్స్ ఇరగదీస్తారు. మెగా ఇమేజ్‌కి దూరంగా మిగిలిపోయిన అల్లు శిరీష్‌కి మాత్రం ఈ జాబితా నుంచి మినహాయింపు దక్కుతుంది.
నిహారికలో డ్యాన్స్ చేయాలనే తపన కనిపిస్తున్నా… అంతకంటే తనలోని గ్లామర్ యాంగిల్ చూపించేందుకు ఈ హాట్ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసినట్టు అనిపిస్తోంది. సినిమాల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక… ఇప్పటిదాకా సరైన బ్రేక్ అందుకోలేకపోయింది.
దాంతో టోటల్‌గా రూట్ మార్చి, గ్లామరస్ రోల్స్ కోసం ప్రయత్నిస్తున్న మెగాడాటర్… ఈ సారైనా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి. అయితే చిత్రసీమ విషాదంలో మునిగిన సమయంలో ఈ వీడియో పోస్ట్ చేయడంతో మెగా డాటర్ కష్టాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
This post was last modified on October 27, 2022 11:32 am
టాక్సిక్ విడుదల వల్ల చాలా చోట్ల ఇరుముడి థియేటర్లు ఉన్నట్టుండి తగ్గిపోయాయి. ఇది ముందస్తుగా జరిగిన ఒప్పందంలో భాగమే అయినా…
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…