డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా.. ఒకప్పుడు చాలామంది హీరోలు, హీరోయిన్లు ఈ మాట చెప్పేవారు. ఐతే గతంలో సినిమాల్లోకి రావాలంటే చదువు పక్కన పెట్టేయాల్సిందే అనుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. చదువుకుంటూ సినిమాలు చేస్తున్న వాళ్లున్నారు. చదువు పూర్తి చేసి సినిమాల్లోకి అడుగు పెడుతున్న వాళ్లూ ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో డాక్టర్ అయ్యాక యాక్టర్లు అయిన వాళ్ల జాబితా పెద్దదే. సీనియర్ హీరోల్లో ఒకరైన రాజశేఖర్ ముఖానికి రంగేసుకోవడానికి పూర్వం డాక్టర్ అన్న సంగతి తెలిసిందే. ఇక క్యారెక్టర్ రోల్స్‌తో పాపులర్ అయిన భరత్ కూడా డాక్టరే.
హీరోయిన్లలో ఈ జాబితాలో కొంచెం పెద్దదే. సాయిపల్లవి, మీనాక్షి చౌదరి, శ్రీ లీల, రూప కొడవయూర్, కామాక్షి భాస్కర్ల.. ఇలా చాలామందే డాక్టర్స్ టర్న్డ్ యాక్టర్స్ ఉన్నారు. ఈ జాబితాలోకి కొత్తగా చేరిన పేరు.. కోమలి ప్రసాద్.
ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ అయిన నాని సినిమా ‘హిట్-3’లో కోమలి కీలక పాత్ర పోషించింది. రఫ్ అండ్ టఫ్ పోలీసాఫీసర్ పాత్రలో ఈ తెలుగమ్మాయి అదరగొట్టింది. హీరోయిన్ తర్వాత అంత ముఖ్యమైన లేడీ క్యారెక్టర్ తనదే.
ఈ అమ్మాయి డెంటిస్ట్ అట. టీనేజీలోనే తాను నటి కావాలని అనుకున్నానని.. కానీ చదువు పూర్తయ్యాకే ఏదైనా అని చెప్పడంతో డెంటల్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు ఆమె తెలిపింది. తర్వాత ఎంఎస్ కూడా చేద్దామని అనుకున్నానని.. కానీ అప్పుడే తనకు ‘నేను సీతాదేవి’ అనే సినిమాలో అవకాశం రావడంతో ఆ అప్లికేషన్ పక్కన పడేసి సినిమాల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. ఆ తర్వాత కోమలి నెపోలియన్, హిట్, టచ్ మి నాట్, లూజర్ (వెబ్ సిరీస్) లాంటి ప్రాజెక్టుల్లో నటించింది. కోమలి లీడ్ హీరోయిన్‌గా నటించిన ‘శశివదనే’ అనే చిత్రం విడుదల ఆలస్యం అవుతోంది. ఈలోపు ‘హిట్-3’లో నటించి మంచి పేరే సంపాదించింది కోమలి.
This post was last modified on May 8, 2025 9:22 pm
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…