నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత కొత్త జీవిత భాగస్వామి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం చూస్తూనే ఉన్నాం. అయితే నేరుగా చెప్పకపోయినా వివిధ రూపాల్లో తన లైఫ్ పార్ట్ నర్ గురించి ఇస్తున్న క్లూలు త్వరలో సస్పెన్స్ ని తీర్చేలా ఉన్నాయట. ఫ్యామిలీ మాన్ సృష్టికర్తల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో కలిసి సామ్ పర్యటిస్తున్న ఫోటోలు ఇటీవలి కాలంలో వైరలవుతున్నాయి. తాజాగా శుభం ప్రమోషన్లలో భాగంగా సామ్ షేర్ చేసిన రెండు పిక్స్ లో రాజ్ ఉండటం ఇప్పటికే ఉన్న ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. ఫలానా బంధమని చెప్పలేదు కానీ అర్థం అదే వస్తోంది.
ఇప్పుడే కాదు సామ్ ఇంతకు ముందు షేర్ చేసిన చెన్నై పికెల్ బాల్ టీమ్ లాంచ్, తిరుపతి సందర్శన ఫోటోల్లోనూ రాజ్ ఉన్నారు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తర్వాత సిటాడెల్ హనీ బన్నీలో సామ్ టైటిల్ రోల్ పోషించడం, రాజ్ అండ్ డీకే ప్రస్తుతం తీస్తున్న రక్త్ బ్రహ్మాండ్ లో మరో కీలకమైన క్యారెక్టర్ దక్కడం వెనుక కారణాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. సమంత నిర్మాతగా మారి తీసిన శుభం దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు సినిమా బండి రూపంలో నిర్మాతలుగా తొలి ఛాన్స్ ఇచ్చింది కూడా రాజ్ అండ్ డికెలే. అందుకే రాజ్ రికమండేషన్ వల్లే ప్రొడ్యూసర్ గా మారే ప్లాన్ లో ఉన్న సమంత ప్రవీణ్ కు అవకాశం ఇచ్చిందనే కోణాన్ని కొట్టి పారేయలేం.
ప్రస్తుతానికి అధికారిక ముద్ర లేదు కాబట్టి సమంత చెప్పే దాకా దీనికి సంబంధించి ఎలాంటి నిర్ధారణకు రాలేం కానీ టాపిక్ అయితే అభిమానుల మధ్య వేడిగా ఉంది. శుభంతో ప్రొడ్యూసర్ గా మారిన సామ్ రెండు మూడు రోజుల ముందే ప్రీమియర్లు వేయిస్తూ థియేటర్లను సందర్శిస్తూ ప్రమోషన్లు చేసుకోవడంలో బిజీగా ఉంది. మా ఇంటి బంగారం టైటిల్ తో తనే మెయిన్ లీడ్ గా నటించే మరో సినిమా జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. కథలతో దర్శకులు వస్తున్నారు కానీ అవేవి నచ్చడం లేదంటున్న సమంత తనకు కాబోయే వాడు ఎవరనేది త్వరగా చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో.
This post was last modified on May 8, 2025 12:36 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…