ఇప్పటి దర్శకులకు వేగం అలవడటం లేదు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ పరిశ్రమకు అవసరమైన స్పీడ్ అంది పుచ్చుకుని ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా ఎందరికో అవకాశాలు, ఉపాధి దొరుకుతాయనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. 2016లో పెళ్లి చూపులుతో దర్శకుడు తరుణ్ భాస్కర్ అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసుకున్నారు. విజయ్ దేవరకొండకి తొలి హిట్టు ఇచ్చిన ఘనత తనకే దక్కింది. తర్వాత ఈ నగరానికి ఏమైంది కమర్షియల్ గా అద్భుతాలు చేయకపోయినా యూత్ లో దానికున్న కల్ట్ ఫాలోయింగ్ రీ రిలీజ్ టైంలో బయట పడింది. రెండేళ్ల క్రితం కీడా కోలాతో జస్ట్ ఓకే అనిపించుకున్నాడు.
మళ్ళీ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుపెట్టలేదు. ఏడాది క్రితం బినామి టైటిల్ తో విజయ్ దేవరకొండ హీరోగా ఒక ప్రాజెక్టు అనుకున్నారు కానీ అది చర్చల దశ దగ్గరే ఆగిపోయింది. ఈలోగా రౌడీ బాయ్ ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయాడు. కింగ్ డమ్, రౌడీ జనార్దనా, మైత్రి బ్యానర్ మూవీ (రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు) తో రెండు మూడేళ్లు దొరకనంతగా ప్యాకయ్యాడు. సో ఈ కాంబో ఇప్పుడప్పుడే జరిగే ఛాన్స్ లేదని అర్థమైపోయింది. కొత్త క్యాస్టింగ్ తో ఈ నగరానికి ఏమైంది 2 మీద వర్క్ జరుగుతోంది కానీ ఎప్పుడు మొదలుపెడతారనేది మాత్రం తరుణ్ భాస్కర్ కు మాత్రమే తెలుసు.
ఏది ఏమైనా కొత్త తరం డైరెక్టర్లు ఇంత నెమ్మదిగా ఉంటే కష్టం. వెయ్యి కోట్ల బిజినెస్ చేసే వాళ్ళు స్లోగా వెళ్లడం ఓకే కానీ మంచి కంటెంట్ తో తక్కువ బడ్జెట్ తో వండర్స్ చేయగలిగిన తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళు సైతం నిదానమే ప్రధానం అనడం కరెక్ట్ కాదు. రాజమౌళి, సుకుమార్ స్కూల్ లో టయర్ 1 హీరోలతో ఆలస్యమైతే ఏదో అనుకోవచ్చు. కానీ మీడియం బడ్జెట్ లు హ్యాండిల్ చేసేవాళ్ళు కూడా అదే దారి పడితే ఎలా. అన్నట్టు తరుణ్ భాస్కర్ హీరోగా చేసిన ఓ మలయాళ రీమేక్ రిలీజ్ కు రెడీ అవుతోంది. డైరెక్టర్ గా ఆర్టిస్టుగా ఎక్కువ ట్రయిల్స్ వేస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ చివరికి ఏ కెరీర్ లో సెటిలవుతాడో చూడాలి.
This post was last modified on May 8, 2025 11:55 am
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…