కరోనా-లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ పెద్ద హీరోల్లో అందరికంటే ముందు చిత్రీకరణలో పాల్గొన్నది అక్కినేని నాగార్జుననే. మిగతా స్టార్లు ఇంకా భయపడుతుండగానే నాగ్ రంగంలోకి దిగి ‘వైల్డ్ డాగ్’ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆ పనిలో ఉండగానే ‘బిగ్ బాస్’ కూడా మొదలుపెట్టేశాడు. అందులోనూ బిజీ అయ్యాడు. ఓవైపు ‘వైల్డ్ డాగ్’ షూట్ చేస్తూనే.. ఖాళీ దొరికినపుడు ‘బిగ్ బాస్’కు వెళ్లాడు.
మధ్యలో ‘వైల్డ్ డాగ్’ కోసమని ‘బిగ్ బాస్’కు కొంత విరామం ఇచ్చి.. మనాలిలో చిత్రీకరణ కోసం వెళ్లాడు నాగ్. అక్కడికి వెళ్లడంలో, రావడంలో ఆలస్యం జరగకూడదని.. ఆయన కోసం ప్రత్యేకంగా హెలికాఫ్టరే ఏర్పాటు చేసింది మా టీవీ యాజమాన్యం. అక్కడ షూటింగ్ ముగియడం ఆలస్యం.. వెంటనే హెలికాఫ్టర్ ఎక్కి హైదరాబాద్‌లో ల్యాండ్ అయిపోయాడు. తిరిగి ‘బిగ్ బాస్’ బాధ్యతలు తీసుకున్నాడు.
ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ షూటింగ్‌కు కొంత విరామం ఇచ్చిన నాగ్.. కొన్ని రోజుల తర్వాత మళ్లీ దాని చిత్రీకరణకు వెళ్లనున్నాడు. అలాగని ఇప్పుడేమీ ఆయన ఖాళీగా ఉండట్లేదు. ఓవైపు వీకెండ్స్‌లో ‘బిగ్ బాస్’ చేస్తూనే మధ్యలో ముంబయిలో ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. నాగ్ చాలా ఏళ్ల తర్వాత హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో నాగ్ పాత్ర అరగంట పాటు ఉంటుంది. ఇంతకుముందే ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నాడు నాగ్. తర్వాత బాగా గ్యాప్ వచ్చింది. కరోనా విరామం తర్వాత ఆ చిత్రం మళ్లీ సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఓ వివాదం తెరపైకి వచ్చింది.
సినిమా నిడివిని మూడు గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గించాలని నిర్మాణ భాగస్వామి అయిన ఫాక్స్ స్టార్ సంస్థ చెప్పగా.. మరో నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు అయాన్ ముఖర్జీ ససేమిరా అన్నారట. ఐతే చర్చల తర్వాత సమస్య పరిష్కారం అయింది. కరణ్, అయాన్‌లు అనుకున్నట్లే 3 గంటల నిడివితోనే సినిమా రాబోతోందట. ఇందులో రణబీర్ కపూర్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 5, 2020 3:33 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…