షూటింగ్ అయిపోయింది ఇంకే టెన్షన్ లేదని హరిహర వీరమల్లు వెంటనే రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అసలైన సవాల్ విడుదల రూపంలో ఉంది. అమెజాన్ ప్రైమ్ తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మే 30 థియేటర్ రిలీజ్ జరిగిపోవాలి. అదే జరిగితే టీమ్ మీద విపరీతమైన ఒత్తిడి నెలకొంటుంది. ఎందుకంటే ఇరవై రెండు రోజుల్లో హైప్ మార్చేయడం అంత సులభం కాదు. ప్రేక్షకుల సంగతేమో కానీ అసలు అభిమానుల్లోనే సినిమా మీద హైప్ పెద్దగా లేదు. అసలు కంటెంట్ ఎక్స్ ట్రాడినరిగా ఉందని, ట్రైలర్ చూశాక అందరి అభిప్రాయాలు మారిపోతాయని టీమ్ అంటోంది. దానికీ డేట్ ఫిక్స్ చేయాలి.
ఒకవేళ ప్రైమ్ కనక వాయిదాకు ఒప్పుకుంటే జూన్ 12 విడుదల చేయాలనేది నిర్మాత ఏఎం రత్నం ప్లాన్. ఇవాళ ముంబైలో దీనికి సంబంధించి చర్చలు జరగబోతున్నట్టు సమాచారం. ఫ్యాన్స్ కోరుకుంటున్నది కూడా ఇదే. మే 30 ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సేఫ్ కాదు. పైగా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఎప్పుడు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అంతు చిక్కడం లేదు. అలాంటప్పుడు ఇంకొంచెం లేట్ కావడం మంచిదే. ఎలాగూ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మే 30 ఉంది కాబట్టి దానికి దారి వదిలినట్టు ఉంటుంది. రత్నం ఎలాంటి కబురు తీసుకొస్తారనే దాని గురించి అందరూ ఎదురు చూస్తున్నారు.
టీజర్ కాకుండా నేరుగా ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారని మరో సమాచారం. అదెప్పుడనేది రిలీజ్ డేట్ మీద ఆధారపడి ఉంటుంది. పబ్లిసిటీ పరంగా ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలనే దాని గురించి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తారట. ప్యాన్ ఇండియా విడుదల కాబట్టి ఈవెంట్లు, ఇంటర్వ్యూలు అవసరమవుతాయి. పవన్ కళ్యాణ్ ఎక్కువ వాటిలో పాల్గొనకపోవచ్చు. హీరోయిన్ నిధి అగర్వాల్ అందుబాటులోనే ఉంది. కీరవాణి పాల్గొంటారు. బాబీ డియోల్ డేట్లు ఉంటే వచ్చి ప్రమోట్ చేస్తాడు. వీటన్నటి కంటే ముందు హరిహర వీరమల్లు పార్ట్ 1 థియేటర్లకు ఎప్పుడు వస్తుందనేది తేలితే అన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చేస్తుంది.
This post was last modified on May 7, 2025 10:18 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…