ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేస్తూ తనకో బ్లాక్ బస్టర్ ఇస్తాడని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మీద సూర్య పెట్టుకున్న నమ్మకం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఇంత బ్యాడ్ టాక్ తోనూ నిన్న వీకెండ్ బుక్ మై షోలో ఎనభై వేల టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. ఒకవేళ యునానిమస్ టాక్ వచ్చి ఉంటే ఆకాశమే హద్దుగా రికార్డులు బద్దలయ్యేవని తెగ ఫీలవుతున్నారు. మొదటి అరగంట మినహాయించి రెట్రోలో చెప్పుకోదగ్గ విశేషం లేకపోవడం కామన్ ఆడియన్స్ ని దూరం చేసింది. ముఖ్యంగా తెలుగు, మలయాళ, కన్నడ ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష పెట్టింది.
కంటెంట్ సంగతి పక్కనపెడితే సూర్యకు బాక్సాఫీస్ వద్ద పోటీ రూపంలో ఎదురైన మూడు దెబ్బలు వసూళ్ల మీద తీవ్ర ప్రభావం చూపించాయి. తెలుగులో హిట్ 3 ది థర్డ్ కేస్ ఇచ్చిన స్ట్రోక్ మామూలుది కాదు. నాని వయొలెంట్ మాస్ ముందు రెట్రో పూర్తిగా తేలిపోయింది. రెట్రోకి పెద్ద డిస్ట్రిబ్యూషన్ అండ దొరికింది కాబట్టి స్క్రీన్లు హోల్డ్ చేశారు కానీ జనాన్ని ఫుల్ చేయడం కష్టమైపోయింది. అటు కేరళలో మోహన్ లాల్ తుడరుమ్ దెబ్బకు రెట్రో తలకిందులైపోయింది. వంద కోట్లు దాటేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడప్పుడే నెమ్మదించేలా లేదు. దీని వల్ల కర్ణాటక నెంబర్లు సైతం సూర్యకు ఆశించిన స్థాయిలో రావడం లేదు.
ఇక స్వంత కోలీవుడ్ సంగతి చూస్తే చిన్న సినిమాగా వచ్చి సునామిగా మారిన టూరిస్ట్ ఫ్యామిలీ జనాన్ని కట్టిపడేస్తోంది. మన దగ్గర డబ్బింగ్ చేయలేదు కానీ తమిళనాడులో క్లాసు మాస్ తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. చెన్నైలోని ప్రముఖ మల్టీప్లెక్స్ మాయాజాల్ లో నిన్న ఒక్క రోజే నలభై దాకా షోలు వేయడమంటే మాటలు కాదు. సబ్ టైటిల్స్ తో హైదరాబాద్ లో కొన్ని షోలు వేస్తే సండే మొత్తం దాదాపుగా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఇంకోవైపు బాలీవుడ్ లో రైడ్ 2 రూపంలో రెట్రోకు స్ట్రోక్ తగిలింది. ఇలా ఇన్ని వైపులా ముప్పేటదాడికి గురైన సూర్య తిరిగి మళ్ళీ ఎప్పుడు సక్సెస్ ట్రాక్ లో పడతారో చూడాలి.
This post was last modified on May 5, 2025 10:32 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…