అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ ఏడాది రిలీజ్ కావడం గురించి బోలెడు అనుమానాలున్నాయి. మేలో వస్తానన్న హరిహర వీరమల్లు సంగతే ఇప్పటి దాకా తేలలేదు. అలాంటిది ఓజి సెప్టెంబర్ లో రావడం గురించి ఎవరూ నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు. పోనీ వచ్చే ఏడాది ఫలానా టైంకి విడుదలవుతుందని చెబితే ఫ్యాన్స్ రిలాక్స్ అవుతారు కానీ అది కూడా జరగడం లేదు. ఇదిలా ఉంచితే కొద్దిరోజుల క్రితం గ్రౌండ్ జీరో ప్రమోషన్లలో భాగంగా దాంట్లో హీరోగా నటించిన ఇమ్రాన్ హష్మీ ఓజి గురించి ఒక బాంబ్ లాంటి అప్డేట్ పేల్చాడు.
అతను చెప్పిన ప్రకారం ఓజిలో విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇప్పటిదాకా ఒక్క సీన్ కూడా షూట్ జరగలేదు. కేవలం ఇతనొక్కడే అవసరమైన సన్నివేశాలు మాత్రమే దర్శకుడు సుజిత్ పూర్తి చేశాడు. ఇంకో నెల రెండు నెలల్లో పిలుపు రావొచ్చని ఇమ్రాన్ హష్మీ చెప్పడం చూస్తే బాలన్స్ బాగానే ఉందని అర్థమవుతోంది. ఇంత కీలక ఆర్టిస్టుతోనే కాంబినేషన్ ఇంకా మొదలు కాలేదంటే దాని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు పంపించి, అటుపై సెన్సార్, ప్రమోషన్లు వగైరాలకు ఎంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి ఈ వీడియో చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ షాక్ తిన్నంత పని చేశారు.
ఒకవేళ ఇమ్రాన్ హష్మీది తక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర అనుకుంటే ఎక్కువ డేట్లు అవసరం లేదనుకోవచ్చు. కానీ తన క్యారెక్టర్ తాలూకు అనౌన్స్ మెంట్ పోస్టర్ వదిలినప్పుడు అందులో స్పష్టంగా “ముంబైలో నీదో నాదో ఎవరిదో ఒక తల మాత్రమే ఉండాలని” పవన్ ని ఉద్దేశించి ఇమ్రాన్ చెప్పిన డైలాగుని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదేదో ఆషామాషీ రోల్ అయితే కాదు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నిర్మాత దానయ్య, దర్శకుడు సుజిత్ 2025లోనే ఓజిని చూపించాలని ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
This post was last modified on May 4, 2025 6:16 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…