జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కిన ప్యాన్ ఇండియా మూవీ వార్ 2 విడుదల ఇంకో నూటా పది రోజుల్లో ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. ఇద్దరు హీరోల కాంబోలో షూట్ చేయాల్సిన పాట ఇంకా బాలన్స్ ఉంది. గాయం వల్ల బ్రేక్ తీసుకున్న హృతిక్ రేపో మాపో పూర్తిగా కోలుకోబోతున్నాడు. డాక్టర్ల సలహా మేరకు అనుకున్న దానికన్నా ఎక్కువ విశ్రాంతి తీసుకోవడంతో వార్ 2 యూనిట్ కు ఎదురు చూపులు తప్పలేదు. ఇదిలా ఉండగా వార్ 2 తెలుగు, తమిళ హక్కులకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. పలు నిర్మాణ సంస్థలు మేమంటే మేమంటూ పోటీ పడుతున్న వైనం గురించి ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది.
కాకపోతే యష్ రాజ్ ఫిలింస్ ఇప్పుడప్పుడే బిజినెస్ డీల్స్ ముగించే ఉద్దేశంలో లేదట. టీజర్ సంగతేమో కానీ అసలు ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ పోస్టర్ వదల్లేదు. తారక్, హృతిక్ గెటప్స్ ఎలా ఉంటాయో సస్పెన్స్ లోనే పెట్టారు. కనీసం హీరోయిన్ కియారా అద్వానీ దర్శనం కూడా కాలేదు. చేతిలో ఉన్న తక్కువ టైంలో వార్ 2 బృందం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది. పోటీలో ఉన్న రజనీకాంత్ కూలి శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఏ కారణంగానూ వాయిదా పడే ఛాన్స్ లేదని చెన్నై టాక్. సో రెడీ అయ్యే విషయంలో వార్ 2 కన్నా కూలినే ఒక అడుగు ముందుండటం ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే.
ప్రస్తుతానికి డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఉన్న సమాచారం మేరకు వార్ 2 రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఓ రెండు మూడు వారాలు బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాత బ్రేక్ తీసుకుని వార్ 2 ప్రమోషన్లలో భాగమవుతాడు. జూన్ చివరి వారం నుంచి ఇవి మొదలుపెట్టాలని యష్ ఫిలింస్ ప్లానింగ్ లో ఉంది. రాజమౌళి తరహాలో దేశమంతా తిరిగి ఈవెంట్లు చేయబోతున్నారు. మొదటిసారి బాలీవుడ్, టాలీవుడ్ పెద్ద స్టార్లు కలిసి నటించిన సినిమా కావడంతో అంచనాలు మాములుగా లేవు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ముందు నుంచి ప్రచారం జరిగినట్టు ఎలాంటి క్యామియోలు లేవట.
This post was last modified on May 3, 2025 8:28 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…