Movie News

మూడేళ్ళ గ్యాపుకి న్యాయం జరిగింది

కెజిఎఫ్ విడుదలైన టైంలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి దశ తిరిగి పోయిందనే అందరూ అనుకున్నారు. కానీ అవకాశాలు రాలేదో లేక వచ్చిన కథలు నచ్చక వద్దనుకుందో ఏమో కానీ బాగా గ్యాప్ తీసుకుంది. తర్వాత వచ్చిన విక్రమ్ కోబ్రా కెజిఎఫ్ కు ముందు ఒప్పుకున్నది కావడంతో దాన్ని పరిగణనలోకి తీసుకోలేం. 2022 తర్వాత తను మళ్ళీ తెరమీద కనిపించలేదు. కట్ చేస్తే హిట్ 3 ది థర్డ్ కేస్ తో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి ఆట నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆల్రెడీ ఫస్ట్ డేలో దసరాని దాటేసి టయర్ 2 హీరోల్లో టాప్ రికార్డు సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తోంది.

హిట్ 3లో ఏదో మొక్కుబడిగా హీరో పక్కన ఆడిపాడే టైపులో కాకుండా శ్రీనిధి శెట్టికి తగిన ప్రాధాన్యం దక్కింది. పాత్రకు ట్విస్టులు పెట్టడంతో ఫైట్లు గట్రా చేయించడం వర్కౌట్ అయ్యింది. పాటల్లో ఉంది కానీ అవి ఫ్లోకి అడ్డుగా ఉండటంతో పాటు మిక్కీ మేయర్ ట్యూన్లు ఏమంత గొప్పగా లేకపోవడం ఒక్కటే కొంత మైనసయ్యింది. ఇది మినహాయిస్తే శ్రీనిధికి ఎక్కువ స్కోప్ దొరికినట్టే. ఈ కారణంగానే కాబోలు ప్రమోషన్ల కోసం నానితో పాటు ముంబై నుంచి బెంగళూరు దాకా లెక్కలేనన్ని ప్రమోషన్లలో పాల్గొంది. కెజిఎఫ్ కు కూడా ఇవ్వని పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపించాయి.

సో హిట్టు పడింది కనక శ్రీనిధి శెట్టి నుంచి వచ్చే తర్వాతి సినిమా సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా. షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. నీరజ కోన దర్శకత్వం వహిస్తుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇది రామ్ కామ్ మూవీ. అంటే హత్యలు గట్రాలు లేకుండా స్మూత్ గా సాగుతుంది. ఈ ఏడాది విడుదల చేసేందుకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్లానింగ్ లో ఉంది. ఇది కాకుండా కన్నడలో సుదీప్ సరసన ఒక ప్యాన్ ఇండియా మూవీ చేస్తోంది శ్రీనిధి. సరే కెరీర్ లో కొంత ఆలస్యం జరిగితే జరిగింది కానీ ఇప్పుడైనా కాస్త వేగం పెంచి ఎక్కువ సినిమాలు చేస్తే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవచ్చు. చూడాలి ఏం చేస్తుందో.

This post was last modified on May 2, 2025 5:52 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

12 minutes ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

1 hour ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

3 hours ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

3 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

3 hours ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

3 hours ago