బాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరు అనే పేరు కంటే.. రకుల్ ప్రీత్ భర్త అనే గుర్తింపుతోనే ఎక్కువ పాపులర్ అయ్యాడు జాకీ భగ్నానీ. బాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న ‘పూజా ఎంటర్టైన్మెంట్స్’ అధినేత వశు భగ్నానీ కొడుకే జాకీ. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ పెద్ద సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ కొన్నేళ్ల ముందు వరకు మంచి స్థాయిలోనే ఉన్నాడు. కానీ ఈ మధ్య ఈ సంస్థ దారుణంగా దెబ్బ తింది. టైగర్ ష్రాఫ్ హీరోగా తీసిన ‘గణ్‌పథ్’ 2023లో పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. గత ఏడాది ఆ సంస్థ నుంచి వచ్చిన ‘బడేమియా చోటేమియా’ ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది. ఆ చిత్రంలోనూ టైగర్ ఒక హీరో. మరో హీరో రోల్ బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అక్షయ్ కుమార్ చేశాడు. ఏకంగా రూ.350 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల దెబ్బకు పూజా ఎంటర్టైన్మెంట్స్ పునాదులు కదిలిపోయాయి.
ముఖ్యంగా ‘బడేమియా చోటేమియా’ మీద పెట్టుబడిలో సగం కూడా వెనక్కి రాకపోవడంతో పూజా ఎంటర్టైన్మెంట్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. నష్టాల భర్తీకి వశు ఫ్యామిలీ ఆస్తులు తనఖాపెట్టుకోవడం, అమ్ముకోవడం వరకు వెళ్లిందని వార్తలు వచ్చాయి. ఆ సంస్థ ఉన్న భారీ బిల్డింగ్‌ను ఖాళీ చేశారు. అంతే కాక సంస్థలో 80 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చేశారు. ఐతే ‘బడేమియా చోటేమియా’ అంత దెబ్బ కొట్టినా వశు, జాకీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. ఐతే ఎట్టకేలకు జాకీ ఆ సినిమా ప్రభావం గురించి మాట్లాడాడు.
‘‘ఔను. ఆ సినిమా వల్ల మా ఆస్తులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇలాంటి పరిస్థితి, బాధ ఎవరికీ రాకూడదు. జీవితంలో నాకొక గుణపాఠాన్ని నేర్పిన సినిమా అది. ఒక ప్రాజెక్టును భారీ స్థాయిలో ఖర్చు చేసి నిర్మించడం ముఖ్యం కాదనే విషయాన్ని మేం రిలీజ్ తర్వాతే గ్రహించాం. మా కంటెంట్‌తో ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని తెలుసుకున్నాం. ప్రేక్షకుల నిర్ణయం ఎప్పుడూ కరెక్టే. మా కంటెంట్ ఎందుకు నచ్చలేదని మేమే పునరాలోచించుకోవాలి. అంతే తప్ప వాళ్ల నిర్ణయాన్ని తప్పుబట్టకూడదు. ఆ సినిమా పెట్టుబడిలో 50 శాతం కలెక్షన్లను కూడా తీసుకురాలేకపోయింది. మా బాధ ఎవరికీ అర్థం కాదు. దీని కోసం మేం ఆస్తులు తాకట్టు పెట్టాం. కానీ ఆ విషయాలను ఇప్పుడు చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు’’ అని జాకీ అన్నాడు.
This post was last modified on May 2, 2025 12:51 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…