ఇటీవలే విడుదలైన సింగిల్ టీజర్ లో ప్రస్తుత ట్రెండ్ ని అనుసరిస్తూ శ్రీవిష్ణు చేసిన కొన్ని అనుకరణలు వివాదానికి దారి తీసేలా ఉండటంతో టీమ్ స్పందించింది. ముఖ్యంగా కన్నప్పలోని శివయ్యా డైలాగును వాడటం, వీడియో చివర్లో మంచు కురిసిపోయిందంటూ పలికిన పదాలు విష్ణుని హర్ట్ చేసినట్టుగా నిన్నే వార్తలు వచ్చాయి. దానికి శ్రీవిష్ణు వీడియో రూపంలో క్షమాపణ చెప్పాడు. తమకు ఎలాంటి దురుద్దేశాలు లేవని, కానీ కన్నప్ప టీమ్ బాధపడిందని తెలిసి మీ ముందుకు వచ్చామని, ఏవైతే ఇబ్బంది కలిగించాయో వాటిని తీసేయడమే కాక సినిమాలో కూడా ఎడిట్ చేయిస్తామని చెప్పి శుభం పలికాడు.
ఇదొక్కటే కాదు బాలయ్య, యానిమల్, చిరంజీవి, వెంకటేష్ అంటూ సింగిల్ లో చాలా రెఫరెన్సులు వాడుకున్నారు. అయితే కన్నప్పదే ఎక్కువ హైలైట్ కావడంతో విష్ణు ఇబ్బంది పడటం గుర్తించి వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకోవడం మంచి విషయమే. మే 9 విడుదల కాబోతున్న సింగిల్ కు ట్రైలర్ వచ్చాకే బజ్ పెరిగింది. యూత్ ని ఆకట్టుకునేలా కామెడీని సెట్ చేసిన విధానం అంచనాలు రేపింది. అయితే శ్రీవిష్ణు చేసిన అనుకరణలు ఇంత దూరం వస్తాయని బహుశా ఊహించి ఉండకపోవచ్చు. కన్నప్ప లాంటి భక్తి చిత్రాన్ని అది విడుదల కాక ముందే ఇమిటేట్ చేయడం సబబు కాదనే కామెంట్లో లాజిక్ ఉంది.
ఏదైతేనేం మొత్తానికి కాంట్రావర్సి పెద్దది కాకుండా త్వరగా ఎండ్ కార్డు పడింది. స్వాగ్ తో గత ఏడాది షాక్ తిన్న శ్రీవిష్ణు ఇప్పుడీ సింగిల్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ట్రెండీ ఎంటర్ టైనర్లకు మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో తనది కూడా వాటి సరసన చేరుతుందనే నమ్మకంతో ఉన్నాడు. రాబోయే ఏడెనిమిది రోజులు ప్రమోషన్ల వేగం పెంచబోతున్నారు. సమంతా నిర్మించిన శుభంతో పాటు జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ తో సింగిల్ కు పోటీ ఉంది. హిట్ 3 వచ్చిన వారానికే థియేటర్లకు వస్తుండటంతో బిజినెస్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. నాని వయొలెన్స్ తో మెప్పిస్తే శ్రీవిష్ణు హాస్యంతో నవ్విస్తాడేమో చూడాలి.
This post was last modified on April 30, 2025 7:13 pm
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…