‘ది రాజా సాబ్’ టీజర్ సిద్ధంగా ఉంది, డబ్బింగ్ చెప్పేస్తే అయిపోతుందని ఒక వార్త. ‘ఫౌజీ’ త్వరగా పూర్తయ్యే సూచనలున్నాయి కాబట్టి ఈ ఏడాది ద్వితీయార్థంలో ముందు ఇదే విడుదలవుతుందని మరో న్యూస్. ‘స్పిరిట్’ కోసం సర్వం సిద్ధం చేసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా మరికొంత కాలం ఆగాలని, ముందు ప్రశాంత్ వర్మ ప్యాన్ ఇండియా మూవీ పూర్తి చేసేందుకు డార్లింగ్ సుముఖంగా ఉన్నాడని మరో టాక్. ఇక్కడితో అయిపోలేదు. ఈ సంవత్సరం చివర్లో ‘కల్కి 2’ మొదలవుతుందని మరో ప్రచారం. లేదు జూనియర్ ఎన్టీఆర్ సినిమా పూర్తి చేసుకుని ప్రశాంత్ నీల్ వెంటనే ‘సలార్ 2’ స్టార్ట్ చేస్తాడని మరో గాసిప్. ఇన్నేసి టాకులు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
వీటిలో కొన్ని నిజం కావొచ్చు, మరికొన్ని అబద్దం కావొచ్చు. కానీ ఏది సరైందని తెలియాలంటే మాత్రం ప్రభాస్ విదేశాల నుంచి తిరిగి రావాలి. అప్పుడుకాని క్లారిటీ రాదు. ముందైతే రాజా సాబ్ కు డబ్బింగ్ చెప్పేస్తే ఈ నెలలో టీజర్ విడుదల చేయాలనేది మారుతీ ప్లాన్. దాని వల్ల బిజినెస్ డీల్స్ వేగంగా పూర్తవుతాయనే ఆలోచన పీపుల్స్ మీడియాలో ఉంది. ఫౌజీని పరుగులు పెట్టించిన హను రాఘవపూడి బ్యాలన్స్ ఫినిష్ చేయడం కోసం పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. మధ్యలో ప్రశాంత్ వర్మ మూవీ తాలూకు వార్తలు, క్యాస్టింగ్ లీక్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కాక ప్రభాస్ అభిమానులు అయోమయానికి గురవుతున్నారు.
టయర్ 1 లో ఉన్న వేరే ఏ స్టార్ హీరోకి ఇలాంటి పరిస్థితి లేదు. ఒకేసారి నాలుగైదు కమిట్ మెంట్స్ ఇవ్వడం వల్ల ప్రభాస్ మధ్యలో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. పోనీ రిలీజులు వేగంగా అవుతున్నాయా అంటే అదీ లేదు. ఇంకో నెలలో కల్కి యానివర్సరీ వచ్చేస్తుంది. ఇప్పటిదాకా ప్రభాస్ సోలో హీరోగా నిర్మాణంలో ఉన్న కొత్త వాటి రిలీజ్ డేట్లు ఖరారు కాలేదు. కన్నప్పలో క్యామియో కాబట్టి దాన్ని మంచు విష్ణు ప్రోడక్ట్ గానే భావించాలి. సో 2026లో ది రాజా సాబ్, ఫౌజీలో ఏదో ఒకటి రావాలనేది అభిమానుల డిమాండ్. దానికి అనుగుణంగా ప్రభాస్ వేగం పెంచుతాడా లేదానేది విదేశాల నుంచి రాగానే తేలుతుంది.
This post was last modified on April 30, 2025 6:26 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…