తమిళ టాప్ స్టార్లలో ఒకడైన సూర్యకు చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేదు. ఒకప్పుడు తెలుగులోనూ అతడికి మంచి మార్కెట్ ఉండేది. తన సినిమాలకు రూ.20 కోట్లకు మించి బిజినెస్ జరిగిన సందర్భాలున్నాయి. సూర్య సినిమా అంటే టాక్ ఎలా ఉన్నా మినిమం పది కోట్ల వసూళ్లు గ్యారెంటీ అన్నట్లుండేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వరుస ఫ్లాపులు అతణ్ని వెనక్కి లాగేశాయి. ఇలాంటి టైంలో ‘కంగువ’తో మళ్లీ సూర్య పూర్వ వైభవం అందుకుంటాడనే అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ చిత్రం ఏకంగా రెండు వేల కోట్ల వసూళ్లు సాధించేస్తుందని నిర్మాత స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అది అతిశయోక్తిలా అనిపించినా.. తమిళంలో హైయెస్ట్ గ్రాసర్ అవుతుందని కోలీవుడ్ జనాలు నమ్మారు. కానీ చివరికి ఈ చిత్రం అతి కష్టం మీద వంద కోట్ల వసూళ్లు సాధించింది. సూర్యకు ఇది మామూలు షాక్ కాదు. ‘కంగువ’ రిలీజ్ ముంగిట సూర్య మామూలు ఉత్సాహంలో లేడు. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా బాగా ప్రమోట్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాను ప్రమోట్ చేసినపుడు సూర్య జోష్ మామూలుగా లేదు. కానీ సినిమా అతడి ఆశలను కూల్చేసింది. దీంతో సూర్యలో కాన్ఫిడెన్స్ బాగా తగ్గిపోయిందని తన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ ప్రమోషన్లలో స్పష్టంగా కనిపించింది.
అటు చెన్నైలో, ఇటు హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లలో సూర్య చాలా డల్లుగా ఉన్నాడు. అతడిలో తెలియని బాధ స్పష్టంగా కనిపించింది. ‘కంగువ’ ప్రభావం ‘రెట్రో’ బిజినెస్, ప్రి రిలీజ్ బుకింగ్స్, ఓపెనింగ్స్ మీద పడుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగులో ఈ సినిమా రిలీజవుతున్నట్లే లేదు. ‘హిట్-3’ పోటీని ‘రెట్రో’ అస్సలు తట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. సినిమా నామమాత్రంగా రిలీజవుతోంది. బుకింగ్స్ చాలా డల్లుగా ఉన్నాయి. సినిమాకు చాలా మంచి టాక్ వస్తే తప్ప పుంజుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.
This post was last modified on April 30, 2025 3:45 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…