మాములుగా హీరోయిన్ మొదటి సినిమా ఫ్లాప్ అయితే దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడానికి వెనుకాడతారు. కానీ భాగ్యశ్రీ బోర్సే కేసు వేరే. మిస్టర్ బచ్చన్ అంత పెద్ద డిజాస్టర్ అయినా తనకు మాత్రం అవకాశాలకు లోటు లేకుండా పోతోంది. విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ మే 30 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంటెన్స్ డ్రామా కాబట్టి భాగ్యశ్రీ పాత్ర రెగ్యులర్ తరహాలో ఉండకపోవచ్చు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో చేస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దసరా లేదా దీపావళిని టార్గెట్ చేసుకుని దాన్ని తగ్గ ప్లానింగ్ లో ఉన్నారు.
దగ్గుబాటి రానా నిర్మాణంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న ‘కాంత’ చివరి స్టేజిలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేలోపు విడుదల తేదీని నిర్ణయించబోతున్నారు. ఇవి కాకుండా భాగ్యశ్రీ బోర్సేకి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. ప్రభాస్ – దర్శకుడు హను రాఘవపూడి కలయికలో తెరకెక్కే ప్యాన్ ఇండియా మూవీలో ఈ అమ్మడినే తీసుకోవాలని చూస్తున్నారట. ఇంకా నిర్ణయం జరగలేదు కానీ ప్రాథమికంగా జరిగిన చర్చల్లో అంగీకారం వచ్చినట్టు తెలిసింది. ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ తర్వాత చేయాల్సిన సినిమా కాబట్టి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. సో భాగ్యశ్రీ బోర్సేకి డేట్ల పరంగా ఇబ్బంది రాకపోవచ్చు.
చూస్తుంటే ఈ అమ్మాయి ట్రాక్ రికార్డు పూజా హెగ్డేని పోలి ఉంటోంది. తను కూడా ముకుంద ఫ్లాప్ తో కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ డీజేతో పెద్ద బ్రేక్ అందుకుంది. తక్కువ టైంలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఇప్పుడు ఫామ్ తగ్గింది కానీ ఒక మూడేళ్లు అగ్ర స్థానాన్ని ఎంజాయ్ చేసింది. ఇప్పుడు అదే హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ తో పరిచయమైన భాగ్యశ్రీ బోర్సేకు ఆఫర్లు వెల్లువెత్తడం చూస్తే పోలిక రావడం సహజం. ఇప్పుడు చేస్తున్న వాటిలో రెండు మూడు హిట్టయినా చాలు బాలీవుడ్ చూపు కూడా భాగ్యశ్రీ మీద పడుతుంది. అందం, అభినయానికి అదృష్టం తోడైతే అంతే మరి.
This post was last modified on April 30, 2025 12:41 pm
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…