తెలుగులో అత్యంత డిమాండ్ ఉండే పండుగ సీజన్ అంటే.. సంక్రాంతే. ఆ టైంలో రిలీజయ్యే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుంది. ఓపెనింగ్స్, ఓవరాల్ కలెక్షన్లు మామూలు రోజుల్లో కంటే చాలా ఎక్కువగా వస్తాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. అందుకే ఈ పండక్కి సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు పోటీ పడుతుంటారు. చాలా ముందుగానే బెర్తులు బుక్ చేస్తుంటారు. 2026 సంక్రాంతి విషయంలోనూ చాలా ముందుగానే పోటీ మొదలైంది. సంక్రాంతి లక్ష్యంగా వివిధ చిత్ర బృందాలు అడుగులు వేశాయి.
చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య బాక్సాఫీస్ పోటీకి వచ్చే సంక్రాంతి వేదిక అవుతందనే అంచనాలు కలిగాయి. కానీ ఇప్పుడా పోటీ లేదని తేలిపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్‌కు వాయిదా వేసేశారు. దీంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు చేయబోయే సినిమానే బాక్సాఫీస్ దగ్గర లీడ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుమించిన పెద్ద సినిమా ఏదీ పండక్కి రిలీజయ్యేలా లేదు.
ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్.. ఇలా మరే టాప్ హీరో సినిమా కూడా వచ్చే సంక్రాంతికి వచ్చే అవకాశాలు లేవు. విక్టరీ వెంకటేష్, రవితేజల కొత్త చిత్రాలు సంక్రాంతిని టార్గెట్ చేసుకోబోతున్నాయని వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా ఆ చిత్రాలు మొదలే కాలేదు. ఇంకా నితిన్ మూవీ ‘యల్లమ్మ’, నవీన్ పొలిశెట్టి చిత్రం ‘అనగనగా ఒక రాజు’ లాంటి సినిమాలు కూడా రేసులోకి రావచ్చు కానీ.. చిరు-అనిల్ సినిమాకు ఉన్న హైప్ ముందు అవి చాలా చిన్నవి. కాబట్టి అనిల్ ఓ మోస్తరు సినిమా తీసినా చాలు.. వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ‘మెగా’ విధ్వంసం గ్యారెంటీ.
This post was last modified on April 29, 2025 6:16 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…