కోడి రామకృష్ణ, బి గోపాల్ తర్వాత బాలకృష్ణకు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడిగా బోయపాటి శీను అంటే అభిమానుల్లో ప్రత్యేకమైన గౌరవముంది. అందుకే ఈ కాంబోలో తెరకెక్కే సినిమా ఏదైనా నిర్మాణంలో ఉన్నప్పుడే రెట్టింపు క్రేజ్ తెచ్చేసుకుంటుంది. అఖండ 2 తాండవం మీద ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. బిజినెస్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాతలు తొందరపడకుండా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఇప్పటిదాకా నలభై శాతానికి పైగానే పూర్తయినట్టు ఇన్ సైడ్ టాక్. నెక్స్ట్ షెడ్యూల్ జార్జియాలో ప్లాన్ చేసుకున్నారు. బాలయ్య అందులో పాల్గొనబోతున్నారు.
ఇందులో అనుకోని సర్ప్రైజ్ అతిథులు ఉంటారని లేటెస్ట్ లీక్. బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ ఒక పవర్ ఫుల్ క్యామియో చేస్తారని ఇన్ సైడ్ టాక్. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆయన ఎంట్రీ జార్జియాలోనే ఉంటుందని వినికిడి. అఘోరాగా కనిపించే బాలయ్యతో ఆయన కలయికలో ఎలాంటి ఎపిసోడ్ ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. గదర్ 2, జాట్ తో మంచి ఊపు మీదున్న సన్నీ డియోల్ కనక నిజంగా అఖండ 2లో భాగమైతే హిందీ మార్కెట్ పరంగా ఉపయోగపడుతుంది. తమ్ముడు బాబీ డియోల్ ఆ మధ్య డాకు మహారాజ్ లో చేశాడు, ఇప్పుడు అన్నయ్య సన్నీడియోల్ అఖండ 2లో వస్తే స్పెషలవుతుంది.
అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు కానీ గాసిప్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. సంయుక్త మీనన్, ఆదిపినిశెట్టి తదితరుల క్యాస్టింగ్ తో అఖండ 2 మొదటి భాగానికి నాలుగింతలు ఎక్కువగా ఉంటుందని వర్క్ చేసిన వాళ్ళ నుంచి వినిపిస్తున్న మాట. అఖండలో ఫస్ట్ హాఫ్ మొత్తం రెండో బాలయ్య మీద వెళ్లిందని, అఘోరా ఎంట్రీ ఇంటర్వెల్ లో చూశామని, కానీ అఖండ 2లో మొదటి నుంచి చివరి దాకా అఘోరా బాలయ్య విశ్వరూపమే కనిపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఈసారి స్పీకర్లు మరోసారి బద్దలు కావడం ఖాయమే. ముందు ప్రకటించిన సెప్టెంబర్ 25 విడుదల తేదీ మారొచ్చని టాక్.
This post was last modified on April 30, 2025 5:36 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…