రీ రిలీజ్ ట్రెండ్ లో ఇది కదా కావలసిందనే మూవీ ఒకటి థియేటర్లలోకి రాబోతోంది. టాలీవుడ్ దశనే కాదు ఇండియన్ సినిమా ప్రస్థానాన్నే మార్చేసిన బాహుబలి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్ లో భారీ ఎత్తున మళ్ళీ విడుదల చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈసారి ప్రత్యేక ఆకర్షణలు తోడు కాబోతున్నాయి. కొత్త రివీల్స్ తో పాటు ఇప్పటిదాకా చూడని సర్ప్రైజ్ లు బిగ్ స్క్రీన్ మీద చూపించబోతున్నారు. అంటే అన్ సీన్ ఫుటేజ్, ఎడిటింగ్ లో కత్తిరించిన సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్లు కొన్ని అదనంగా జోడించబోతున్నారు. అవేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఈ రోజే ప్రకటించడానికి కారణముంది. ఏప్రిల్ 28 బాహుబలి 2 రిలీజైన స్పెషల్ డేట్. అడవి రాముడు, పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్లు వచ్చిన రోజే బాహుబలి 2 ది కంక్లూజన్ చరిత్ర సృష్టించింది. అప్పటిదాకా రీజనల్ అనే ముద్ర ఉన్న తెలుగు సినిమా వైపు హిందీ పెద్దలు ఈర్ష్యతో చూసే పరిస్థితిని సృష్టించింది. తెలుగు రాష్ట్రాలకు మాత్రమే రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ అమాంతం ప్యాన్ ఇండియా నటుడైపోయాడు. రాజమౌళి బ్రాండ్ దశదిశలా వ్యాపించింది. ఎంఎం కీరవాణి సంగీతం కొత్త పుంతలు తొక్కింది. అనుష్క, సత్యరాజ్, అడివి శేష్, రమ్యకృష్ణలతో పాటు భల్లాలదేవగా రానాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
ఫ్లాప్ సినిమాల రీ రిలీజులకే ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉందో చూస్తున్నాం. అలాంటిది బాహుబలి వస్తోందంటే రచ్చ ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అయితే బాహుబలి బిగినింగ్, కంక్లూజన్ రెండూ ఒకేసారి రిలీజ్ చేస్తారా లేక మొదటి భాగం మాత్రమే అక్టోబర్ లో వస్తుందా అనేది క్లారిటీగా చెప్పలేదు. ఎందుకంటే పదో వార్షికోత్సవం బిగినింగ్ ది. కంక్లూజన్ ఎనిమిదో సంవత్సరంలో ఉంది. ఎస్ఎస్ఎంబి 29 నిర్మాణం మొదలైన సంవత్సరం కాబట్టి మహేష్ బాబు అభిమానుల సపోర్ట్ బాహుబలికి పుష్కలంగా ఉండబోతోంది. ఈసారి ఎలాంటి రికార్డులు బద్దలవుతాయో, ఏ మైలురాళ్ళు నమోదవుతాయో చూడాలి.
This post was last modified on April 28, 2025 5:11 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…