Movie News

శ్రీనిధి శెట్టి లీకులు వద్దన్నా వచ్చేశాయి

కొద్దిరోజుల క్రితం హిట్ 3 లో క్యామియో చేయబోయే స్టార్ హీరో పేరు బయటికి లీకైపోవడంతో దర్శకుడు శైలేష్ కొలను హర్ట్ అవ్వడం చూశాం. టెక్నాలజీ ఆధిపత్యం చెలాయించే ఈ వైరల్ ప్రపంచంలో ఇలాంటివి కట్టడి చేయడం కష్టమే కానీ వీటిని పాజిటివ్ గా తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండటం లేదు. అయితే అనుకోకుండా యూనిట్ సభ్యులే కొన్ని ముఖ్యమైన లీకులకు కారణమవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాక్షన్ కొరియోగ్రాఫర్ సతీష్ మాట్లాడుతూ శ్రీనిధి శెట్టికి ఒక ఫైట్ ఉంటుందని, ఆవిడ చాలా బాగా చేసిందని చెప్పడమే కాక అడివి శేష్ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు.

యాంకర్ సుమ కనక అయ్యో అయ్యో అంటూ ఆపి ఉండకపోతే మరికొన్ని షేర్ చేసేవారేమో కానీ అక్కడితో స్పీచ్ కు సరదాగా బ్రేక్ పడింది. ఇదొక్కటే కాదు ఇంతకు ముందు వేరే భాషకు ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూలో మీరు హిట్ 4లో మీరు ఉంటారా లేదాని శ్రీనిధిని అడిగితే, ఏమో కెజిఎఫ్ లాగా నన్ను చంపేస్తే ఏం చేయలేను కదా అంటూ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇవ్వడం ఫ్యాన్స్ రకరకాలుగా విశ్లేషించుకున్నారు. అంటే ఆ క్యారెక్టర్ చివరిదాకా ఉండదనే కోణంలో జోస్యం చెప్పేసుకున్నారు. సరే ఇలా కీలకమైన విషయాలు బయటికి రావడం వల్ల లాభమా నష్టమా అనే లెక్క కన్నా అవి ఆసక్తిని పెంచుతున్నాయనేది వాస్తవం.

కెజిఎఫ్ తర్వాత బ్రేక్ లేకపోవడంతో శ్రీనిధి శెట్టి ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. అందుకే నానితో కలిసి దేశామంతా ప్రమోషన్ల కోసం తిరిగింది. ప్రతి ఇంటర్వ్యూని వదలకుండా ఇచ్చింది. నాని ఒక్కడే ఏ ప్రమోషన్ చేయలేదు. శ్రీనిధిని ఎక్కడా మిస్సవ్వనివ్వలేదు. ఈ కెమిస్ట్రీ చూసి చాలా మంది హిట్ 3లో సగం లవ్ స్టోరీ ఉంటుందనుకుంటున్నారని నాని నిన్న ఈవెంట్ లో చెప్పడం విశేషం. గతంలో ఏ హీరోయిన్ నానితో ఇన్నేసి మీడియా ముఖాముఖీల్లో పాల్గొనలేదు. హిట్ 3 కనక సక్సెస్ అయ్యి తర్వాత సిద్ధూ జొన్నలగడ్డతో చేసిన తెలుసు కదా కూడా విజయం అందుకుంటే శ్రీనిధి శెట్టికి తెలుగులో కెరీర్ దొరికినట్టే. చూద్దాం.

This post was last modified on April 28, 2025 11:26 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

3 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

6 hours ago