హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రమోషన్ల పర్వంలో చివరి ఘట్టం జరిగింది. విడుదలకు 4 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో దేశమంతా తిరిగి సినిమాను ప్రమోట్ చేసుకున్న నాని ఫైనల్ ఎపిసోడ్ కు వచ్చేశాడు. ముఖ్య అతిథిగా దర్శక ధీర రాజమౌళితో పాటు హిట్ 1, 2 హీరోలు విశ్వక్ సేన్, అడివి శేష్ గెస్టులుగా రావడం ప్రత్యేకత సంతరించుకుంది. ఆద్యంతం కలర్ ఫుల్ గా జరిగిన వేడుకలో ఊహించని సర్ప్రైజ్ లు ఇచ్చారు. మూవీలో అర్జున్ సర్కార్ పాత్ర వేసుకున్న వైట్ బ్లేజర్ ని జక్కన్నకు కానుకగా ఇచ్చి అక్కడికక్కడే వేయించడం ఆకట్టుకుంది. ఎస్ఎస్ఎంబి 29 మొదలయ్యాక రాజమౌళి హాజరైన బిగ్గెస్ట్ పబ్లిక్ ఈవెంట్ ఇదే కావడం విశేషం.
ఇక యాంకర్ సుమ సరదాగా నిర్వహించిన స్టేజి ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన అప్డేట్ రాబట్టింది. రాజమౌళి డ్రీం ప్రాజెక్టు అయిన మహాభారతంలో నాని ఉంటాడా లేదా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఠక్కున బదులిస్తూ నాని డెఫినిట్ గా ఉంటాడని చెప్పడం ప్రాంగణాన్ని చప్పట్లతో హోరెత్తించింది. ఇటీవలే అమీర్ ఖాన్ తాను మహాభారతం తీయబోతున్నట్టు, స్క్రిప్ట్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఇక రాజమౌళి ఈ ఆలోచనని పూర్తిగా మానుకుంటారేమోనని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమి లేదని స్పష్టంగా కుండబద్దలు కొట్టేశారు.
ఈ లెక్కన భవిష్యత్తులో రాజమౌళి మహాభారతం టాలీవుడ్ నుంచి రావడం ఖాయమే. ఒకవేళ ఆ ఉద్దేశం లేకపోతే ప్రకటించినప్పుడు చూద్దామనో లేదా ప్లాన్ చేసినప్పుడు చెబుతాననో అనొచ్చు. కానీ అలా కాకుండా నాని ఉంటాడని గ్యారెంటీ ఇవ్వడం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఒకవేళ ఇది నిజంగా కార్యరూపం దాలిస్తే తెలుగులో అతిరథ మహారథులందరూ ఇందులో భాగమవుతారు. రాజమౌళి హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, నితిన్, సునీల్ తో పాటు ఎవ్వరైనా సరే నో చెప్పకుండా అడిగిన పాత్ర చేసేస్తారు. ఎంత ఆలస్యమైనా సరే చరిత్రలో నిలిచిపోయే ఎపిక్ ఇవ్వాలనేది ప్రతి మూవీ లవర్ కోరిక.
This post was last modified on April 27, 2025 10:38 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…