సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కి బ్లాక్ బస్టర్ అవసరమైన టైంలో దాన్ని విరూపాక్ష రూపంలో ఇచ్చి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు కార్తీక్ దండు ఇప్పుడో మిస్టిక్ థ్రిల్లర్ తో రెడీ అవుతున్నాడు. ఇటీవలే తండేల్ సూపర్ హిట్ తో విజయాల దారిలో పడ్డ నాగ చైతన్యతో చేతులు కలిపాడు. నిజానికీ ప్రాజెక్టు లాకై నెలలు గడిచిపోయాయి. కానీ ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటయించడంతో పాటు అంత టైం ఎందుకు పట్టిందో అర్థమయ్యేలా అనౌన్స్ మెంట్ వీడియోని ఇవాళ రిలీజ్ చేశారు. ఎస్విసిసి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంయుక్త భాగస్వాములు.
ఒక అంతుచిక్కని రహస్యాన్ని ఛేదించే యువకుడి పాత్రలో నాగచైతన్య చాలా ఇంటెన్స్ గా కనిపించబోతున్నాడు. స్టోరీకి సంబంధించిన క్లూస్ ఇవ్వలేదు కానీ వీడియోని నిశితంగా గమనిస్తే ఎత్తయిన కొండలు, లోయలు, జలపాతాలు, దట్టమైన అడవులు, అంతు చిక్కని నిర్మాణాలు, పురాతన భావనాలు ఇలా పెద్ద సెటప్పు సెట్ చేశారు. విరూపాక్షతో టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న అజనీష్ లోకనాథ్ దీనికి సంగీతం సమకూర్చడం విశేషం. క్యాస్టింగ్ ఇతరత్రా వివరాలు ఇంకా బయట పెట్టలేదు కానీ వృషకర్మ అనే టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీమ్ దాని గురించి అధికారికంగా చెప్పడం లేదు.
ఏదైతేనేం ప్రయోగాల జోలికి వెళ్లి కస్టడీ, లాల్ సింగ్ చద్దా, థాంక్ యు లాంటి డిజాస్టర్లు చూసిన చైతు ఇప్పుడు సరైన దారిలో వెళ్తున్నాడు. ట్రెండ్ గా మారిన థ్రిల్లర్స్ ని ఎంచుకోవడం మంచి ఎత్తుగడ. వచ్చే ఏడాది విడుదలని ప్లాన్ చేసుకుంటున్న ఈ ఎన్సి 24కి పెద్ద బడ్జెట్ కేటాయించబోతున్నారు. సుకుమార్ సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి కంటెంట్ పరంగా నమ్మకంగా ఉండొచ్చు. ఇటీవలే జాక్ తో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన బివిఎస్ఎన్ ప్రసాద్ ఈసారి మరింత గ్రాండ్ స్కేల్ తో దీన్ని తెరకెక్కించబోతున్నారు. చైతు సైతం ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద ధీమాగా కనిపిస్తున్నాడు.
This post was last modified on April 26, 2025 5:12 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…