టాలీవుడ్లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే క్వాలిటీ, వెరైటీ చూపించే హీరో నాని. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం.. ఇలా ఏడాదిన్నర వ్యవధిలో మూడు భిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. వచ్చే వారం అతడి నుంచి రాబోతున్న ‘హిట్-3’ మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఒక సినిమా చేస్తుండగానే.. ఇంకో సినిమాకు అన్నీ సిద్ధం చేసుకుని.. కొత్త చిత్రం విడుదలైన వెంటనే ఆ చిత్రాన్ని పట్టాలెక్కించడం నానికి అలవాటు. ఐతే ఈసారి నాని రెండు సినిమాలను ఓకే చేసి పెట్టుకున్నాడు. అందులో ఒకటి ‘ది ప్యారడైజ్’. ‘హిట్-3’ వచ్చిన కొన్ని రోజుల్లోనే దీని షూటింగ్ మొదలు కాబోతోంది. దీంతో పాటు నాని.. ‘సాహో’ దర్శకుడు సుజీత్‌తో ఒక సినిమాను ఓకే చేశాడు.
గత ఏడాదే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ సుజీత్ నానితో ఎప్పుడు సినిమా మొదలుపెడతాడనే విషయంలో క్లారిటీ లేదు. అందుక్కారణం.. అతను ‘ఓజీ’లో లాక్ అయిపోయి ఉండడమే. ఒక దశలో సుజీత్‌తో నాని సినిమా ఉండదేమో అని అనుమానాలు కలిగాయి. ఐతే ఆ సందేహాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదని నాని క్లారిటీ ఇచ్చాడు. సుజీత్‌తో తన సినిమా తప్పకుండా ఉంటుందని.. కానీ షూటింగ్ కొంచెం ఆలస్యంగా మొదలు కావచ్చని నాని తెలిపాడు.
ఆ సినిమాను 2027లో రిలీజ్ చేస్తామని నాని ప్రకటించడం విశేషం. ‘ఓజీ’ని ప్రొడ్యూస్ చేస్తున్న డీవీవీ దానయ్యనే ఈ చిత్రాన్ని కూడా నిర్మించాల్సింది. కానీ కారణాలేంటో తెలియదు కానీ.. దానయ్య ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కి వెళ్లాడు. నానితో ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన వెంకట్ బొల్లినేని చేతికి ఈ సినిమా వెళ్లినట్లు ఇంతకుముందే వార్తలు వచ్చాయి. ‘శ్యామ్ సింగ రాయ్’తో తన బేనర్‌కు మంచి విజయాన్నందించిన నాని మీద వెంకట్‌కు చాలా అభిమానం ఉంది. ‘శ్యామ్ సింగరాయ్’ తర్వాత ‘సైంధవ్’తో షాక్ తిన్న ఆయన.. మళ్లీ నాని సినిమాతోనే బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు.
This post was last modified on April 26, 2025 12:41 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…