నిన్న తెలుగులో రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి సారంగపాణి జాతకం. మరొకటి అలిపుజ జింఖానా. పర్వాలేదు నుంచి బాగానే ఉన్నాయనే టాక్స్ తెచ్చుకున్నాయి. మరీ బ్యాడ్ అనిపించుకోకపోవడం బయ్యర్లకు ఊరట కలిగించింది. బుక్ మై షో ట్రెండ్స్ చూస్తే రెండు చిత్రాలూ గత ఇరవై నాలుగు గంటల్లో పది వేల లోపే టికెట్లు అమ్మాయి. ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఇది మంచి నెంబరే అయినా హిట్ టాక్ వచ్చినవాటికి కనీసం పదిహేను నుంచి ఇరవై వేల మధ్యలో నమోదు కావాలి. ఈరోజు రేపు వీకెండ్ సెలవులను ఇవి ఎంత మేరకు వాడుకోబోతున్నాయనే దాన్ని బట్టి వీక్ డేస్ ఆక్యుపెన్సీలు ఆధారపడి ఉన్నాయి.
చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు డీసెంట్ అనిపించుకునే రిపోర్ట్స్ వచ్చాయి. సారంగపాణి జాతకం మరీ హిలేరియస్ గా మ్యాడ్ రేంజ్ లో నవ్వించలేదు కానీ ఉన్నంతలో కాలక్షేపం చేయించిందనే మాట ఫ్యామిలీ ఆడియన్స్ తనవైపు తిప్పుకునే అవకాశం ఇవ్వకపోదు. కానీ నిన్న ప్రధానంగా బిసి సెంటర్స్ లో పెద్దగా జనాలు కనిపించలేదు. టాక్ వచ్చాక చూద్దాంలే అనే ధోరణితో ప్రేక్షకులు ఎదురు చూడటంతో ఎక్కువ శాతం థియేటర్లు బొటాబొటి పబ్లిక్ తోనే షోలు రన్ చేశాయి. జింఖానాకు యువత బాగానే వెళ్తున్నారు కానీ అది కూడా మేజిక్ చేసేంత స్థాయిలో అయితే కాదు.
ఒక్కటి మాత్రం నిజం. ఈ మాత్రం టాక్ తెచ్చుకోవడానికే గత రెండు మూడు వారాల సినిమాలు కిందా మీదా పడ్డాయి. ఎంత పుష్ చేసినా అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల 2 బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్ళలేదు. మరి సారంగపాణి జాతకం అయినా ఆ మార్కు అందుకుంటే మంచిదే. కాకపోతే ఈ రోజు నుంచి అనూహ్యమైన పికప్ రావాలి. కౌంటర్ బుకింగ్స్ పెరగాలి. అమీతుమీలాగా స్లో పాయిజన్ అవ్వాలి. డబ్బింగ్ వెర్షన్ కాబట్టి జింఖానా భారీగా ఆడకపోయినా ఓ మోస్తరుగా లాగించినా మైత్రికి సేఫ్ గేమ్ అవుతుంది. హిట్ 3 వచ్చే లోపు పెట్టుబడిని వెనక్కు తీసుకోవచ్చు. వసూళ్ల పర్వం ఎలా ఉండబోతోందో ఈ రెండు రోజులు గమనించాలి.
This post was last modified on April 26, 2025 10:42 am
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…