సమంత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ఉండొచ్చు. కొన్నేళ్లుగా ఆమె ఫిలిం కెరీర్ కూడా డౌన్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఇండస్ట్రీలో ఆమెకు కొందరు గట్టి ఫ్రెండ్స్ ఉన్నారు. ఎలాంటి సమయంలో అయినా ఆమె కోసం వాళ్లు నిలబడతారు. ఓవైపు నాగచైతన్య నుంచి విడాకులు.. మరోవైపు మయోసైటిస్‌తో పోరాటం.. ఇలా సమంత వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నపుడు ఆ స్నేహితులే ఆమెకు అండగా నిలిచారు. అలాంటి స్నేహితుల్లో రాహుల్ రవీంద్రన్ ఒకడు. గాయని చిన్మయి సమంతకు క్లోజ్ ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే.
చిన్మయిని పెళ్లాడిన రాహుల్ సైతం సమంతకు క్లోజే. వీళ్లిద్దరూ కలిసి కొన్ని చిత్రాలకు పని చేశారు కూడా. రాహుల్ తన కోసం ఎంత బలంగా నిలబడతాడో చెన్నైలో జరిగిన ఒక అవార్డుల వేడుకలో ప్రత్యేకంగా ప్రస్తావించింది సమంత. ‘‘నాకు ఆరోగ్యం బాగా లేనపుడు రాహుల్ నా వెంటే ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నాడు. మా అనుబంధానికి పేరు పెట్టలేను. అతను నాకు నా స్నేహితుడా.. సోదరుడా.. కుటుంబ సభ్యుడా.. రక్త సంబంధీకుడా అన్నది చెప్పలేను’’ అని సమంత చెప్పుకొచ్చింది.
ఈ వేడుకలో రాహుల్ సైతం పాల్గొన్నాడు. సోషల్ మీడియాలో సమంత మీద జరిగే ట్రోలింగ్‌ను తిప్పి కొట్టడంలో చిన్మయి, రాహుల్ ముందుంటారన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తన అభిమానుల గురించి కూడా ఈ వేడుకలో సమంత మాట్లాడింది. ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం తన అదృష్టమని.. తాను పడిన కష్టానికి అదృష్టం కూడా తోడవడం వల్లే ఈ రోజు ఇంతమంది తన వెంట ఉన్నారని.. వాళ్లే తనను డ్రైవ్ చేస్తారని సమంత వ్యాఖ్యానించింది. ఈ వేడుకలో సమంత ‘గోల్డెన్ క్వీన్’ అవార్డును అందుకుంది.
This post was last modified on April 25, 2025 8:13 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…