2021 సంక్రాంతికి భారీ చిత్రాలేమీ ఉండవని ఇప్పటికే అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆ పండుగ సీజన్‌కు అటు ఇటుగా ఇంకో రెండు నెలలు మాత్రమే సమయం ఉండగా.. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు చాలా వరకు తెరుచుకోలేదు. ఏ పెద్ద సినిమా కూడా విడుదల దిశగా అడుగులేస్తున్నట్లు సంకేతాలే కూడా లేవు. చిరంజీవి సినిమా ఆచార్య రేసు నుంచి ఎప్పుడో తప్పుకుంది. ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ వేసవి రేసులోకి వెళ్లిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ రిలీజ్ గురించి కూడా చప్పుడు లేకపోవడంతో పెద్ద సినిమాల కళ లేనట్లే అనుకున్నారంతా.
కానీ ఇప్పుడు ఉన్నట్లుండి వకీల్ సాబ్ సంక్రాంతి రేసులోకి వస్తున్నట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఏడు నెలలకు పైగా విరామం తర్వాత నవంబరు 1నే పవన్ కళ్యాణ్ మళ్లీ మేకప్ వేసుకున్నాడు. అది వకీల్ సాబ్ కోసమే. అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్ర షూటింగ్ జోరుగా సాగుతోంది. కోర్టు నేపథ్యంలో సినిమాలో అత్యంత కీలకమైన, ఉద్వేగభరితమైన సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. పవన్ రెండు వారాల పాటు నిర్విరామంగా షూటింగ్‌కు హాజరవుతాడట. అంతటితో ఆయన పాత్ర తాలూకు సన్నివేశాలన్నీ దాదాపు పూర్తి కావస్తాయని సమాచారం.
పవన్ రావడానికి నెల ముందే ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ పున:ప్రారంభం అయింది. వేరే నటీనటులతో సన్నివేశాల చిత్రీకరణ సాగించాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇప్పుడు పవన్‌తో ముడిపడ్డ సన్నివేశాలన్నీ పూర్తి చేయబోతున్నారు. నవంబరు నెలాఖరుకు టాకీ పార్ట్ దాదాపు పూర్తి కావస్తుందని.. సంక్రాంతికి ఒకప్పట్లా సినిమాలు నడిచే పరిస్థితి ఉంటే ‘వకీల్ సాబ్’ను రేసులో నిలపాలని చూస్తున్నారని తాజా సమాచారం. త్వరలోనే ఈ విషయమై నిర్మాత దిల్ రాజు స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మీడియం రేంజ్ నాలుగు సినిమాలు సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించిన నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ రేసులో ఉంటే వాటి నిర్మాతల ప్రణాళికలు మార్చుకుంటారు.
This post was last modified on November 3, 2020 11:20 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…