మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రూపొందబోయే భారీ ఎంటర్ టైనర్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో మెగా 157 లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కు సంబంధించిన పనుల్లో అనిల్ బిజీగా ఉన్నాడు. విలన్ గా ఎవరిని తీసుకోవాలనే దాని మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయట. ఆరెక్స్ 100 హీరో కార్తికేయని మంచి ఆప్షన్ గా భావిస్తున్నట్టు లేటెస్ట్ లీక్. గతంలో తను అజిత్ వలిమై, నాని గ్యాంగ్ లీడర్ లో ప్రతినాయకుడిగా మెప్పించాడు. కాకపోతే ఆ రెండూ పెద్ద స్థాయిలో బ్లాక్ బస్టర్లు కాలేదు కానీ కంటెంట్ పరంగా పేరు తీసుకొచ్చాయి.
హీరోగా బాగా స్ట్రగుల్ అవుతున్న కార్తికేయకు సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. ఇన్నేళ్ల కెరీర్ లో పట్టుమని అయిదు హిట్లు లేకపోవడం కెరీర్ మీద ప్రభావం చూపిస్తోంది. బెదురులంక 2012 ఓ మోస్తరుగా బాగానే ఆడినప్పటికీ పెద్ద బ్రేక్ అయితే దక్కలేదు. ఈ నేపథ్యంలో తాను విపరీతంగా అభిమానించే చిరంజీవి సినిమాలో భాగం అంటే క్షణమైనా ఆలోచించకపోవచ్చు. పైగా అనిల్ రావిపూడి విలన్లు భీకరంగా ఉండరు. కాస్త ఫన్ టచ్ కూడా ఉంటుంది. అజిత్ తో నటించడం ద్వారా ఒక కలను నెరవేర్చుకున్న కార్తికేయ ఇప్పుడు జీవిత లక్ష్యమైన మెగా మూవీలో చిరు పక్కన కనిపించడం నెరవేరితే అంతకన్నా ఏం కావాలి.
ప్రస్తుతానికి ఇది లీక్ కాబట్టి అధికారిక ముద్ర వచ్చే దాకా ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. విశ్వంభర ప్రమోషన్లు త్వరలోనే మొదలుపెట్టబోతున్న నేపథ్యంలో చిరంజీవి వాటికి అవసరమైన డేట్లు మినహాయించి అనిల్ రావిపూడికి నాన్ స్టాప్ గా రెండు నెలలు కాల్ షీట్స్ ఇస్తారని సమాచారం. హీరోయిన్ తదితర వివరాలకు సంబందించిన సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. 2026 సంక్రాంతి విడుదలని లాక్ చేసుకోవడంతో దానికి అనుగుణంగానే షెడ్యూల్స్ ఉండబోతున్నాయి. చిరంజీవి రా ఆఫీసర్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది కానీ అది ఉత్తిదేనని యూనిట్ మాట. చూడాలి మరి కార్తికేయ న్యూస్ నిజమవుతుందో లేదో.
This post was last modified on April 24, 2025 1:03 pm
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…